ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే

– ప్రభుత్వ విప్‌ల సమావేశంలో సీఎం రేవంత్

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2 : ప్రభుత్వానికి కళ్లు, చెవులు విప్‌లే అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. శాసనసభ, శాసనమండలి విప్‌లతో ఎంసీహెచఆర్‌డీలో సీఎం శనివారం సమావేశమయ్యారు. వేసవి నేపథ్యంలో నియోజవర్గాల్లో తాగునీరు, సాగునీటి అవసరాలకు తీసుకోవాల్సిన చర్యలు, ధాన్యం సేకరణలో పురోగతి వివరాలను, ఇతర ప్రజా సమస్యలను ప్రభుత్వ విప్‌లు సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ధాన్యం సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విప్‌లు నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించాలని దిశానిర్దేశం చేశారు. సమస్యల పరిష్కారంలో స్థానిక, జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయికి మరింతగా తీసుకెళ్లాలని, సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరిస్తుందన్న నమ్మకం ప్రజలకు కల్పించాలని సీఎం సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడానికి ప్రసార మాధ్యమాలను ఉపయోగించుకోవాలన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు సమస్యలను ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని కూడా సూచించారు. ప్రభుత్వ విప్‌లతో సమన్వయం చేసుకునేందుకు, ప్రజా సమస్యలు తెలసుకునేందుకు వారంలో ఒక రోజు విప్‌లకు అందుబాటులో ఉంటానని సీఎం తెలిపారు. సమావేశంలో పార్టీ ఎంపీ వేం నరేందర్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, విప్‌లు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, విజయరమణరావు, రామచంద్రు నాయక్, వేముల వీరేశం, అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *