రాంగ్‌రూట్‌.. గాలిలో క‌లిసిన ఇద్ద‌రి ప్రాణాలు

-‌ స్కూటీపై ఉన్న ఇద్దరు అక్కడిక్కడే మృతి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 26: ‌నగరంలోని గచ్చిబౌలిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. రాంగ్‌ ‌రూట్‌లో వచ్చిన స్కూటీని.. ద్విచక్రవాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. బైక్‌పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి స్వల్పగాయాలయ్యాయి. గచ్చిబౌలిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వినోద్‌ అనే వ్యక్తి  శుక్రవారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో తన బైక్‌పై గచ్చిబౌలి నుంచి హఫీజ్‌పేట్‌ ‌వైపు వెళ్తున్నారు. అదే సమయంలో హఫీజ్‌పేట్‌ ‌నుంచి గచ్చిబౌలి వైపు రాంగ్‌ ‌రూట్‌లో ఫ్లై ఓవర్‌ ‌దుగా శ్రీకాంత్‌, ‌విట్టల్‌ ‌స్కూటీపై వెళ్తున్నారు. ఈ క్రమంలో రెండు వాహనాలు ఒకదానికొకటి బలంగా ఢీకొన్నాయి. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే గచ్చిబౌలి పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *