– అన్ని వర్గాల ప్రజల సంక్షేమం లక్ష్యంగా పోరాటం
– ప్రజలకు విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి
– ‘మీట్ ద ప్రెస’లో టీఆరఎస్ అధ్యక్షురాలు కవిత
– ‘మీట్ ద ప్రెస’లో టీఆరఎస్ అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 2: తమ పార్టీ ఐదు అంశాలను ప్రధాన అజెండాగా తీసుకుందని, వాటిపై పాంచజన్యం పూరించామని తెలంగాణ రక్షణసేన (టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. ఇక విజయపథంలోకి దూసుకుపోతామని, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా పోరాటం చేస్తామని చెప్పారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్టబ్‌లో శనివారం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కవిత మాట్లాడారు. పేదలకు నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం అందాలన్నదే తమ లక్ష్యం అన్నారు. ధాన్యం కొనుగోళ్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజులతరబడి పడిగాపులు కాస్తున్నారని, ధాన్యం కుప్పలపైనే ప్రాణాలు విడుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వాలు ఇస్తున్న హామీల వల్ల ఉపాధి అంటే హాస్యాస్పదమైందని, తాము చెప్పే ఉపాధి కల్పన అంటే ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే కాదు.. యువత, మహిళలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలి.. వారిని వ్యాపారులుగా తీర్చిదిద్దే ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. రూ.2 లక్షల నుంచి రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. ప్రభుత్వాలు భర్తీ చేయని బ్యాక్‌లాగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తామని కవిత తెలిపారు. 20 ఏళ్లుగా కొనసాగుతున్న తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ అలాగే కొనసాగుతుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై టీఆరఎస్ పోరాటం చేస్తుందని, సర్వోదయ తెలంగాణ లక్ష్యంతో ముందుకు సాగుతుందని వెల్లడించారు. ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నా, భవిష్యత్తులో అధికారంలోకి వచ్చినా ఐదు అంశాలు ప్రధాన ఫోకస్‌గా ఉంటాయని చెప్పారు. ప్రజల ఆదాయంలో 60 శాతం విద్య, వైద్యం కోసమే ఖర్చవుతోందని, క్యాన్సర్ వంటి వ్యాధులతో చికిత్సకు డబ్బుల్లేక చనిపోతున్న పరిస్థితి ఉందని, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ఎన్ని లక్షలు ఖర్చయినా ప్రజల వైద్యం కోసం వెనుకడుగు వేయదని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉచిత విద్య ఇస్తున్నా 75 శాతం మంది ప్రైవేటు సంస్థల్లో చదువుతున్నారని, వారందరికీ ఉచిత విద్య అందించేందుకు అన్ని లెక్కలు వేసినట్లు తెలిపారు. రైతన్నలకు మేలు చేసే విషయంలో తాము చాలా సీరియస్‌గా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఉపాధి అంటే ఒక జోక్‌గా మారిందని, యువత అవసరాలను ప్రభుత్వం అర్థం చేసుకోవడం లేదని కవిత విమర్శించారు. రిటైర్ అయిన ఐఏఎస్, ఐపీఎస్‌లకు కూడా బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదంటూ తమ ప్రభుత్వం వచ్చాక సీనియర్ సిటిజన్స్ కోసం ప్రత్యేక శాఖ ఏర్పాటు వారి సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలు, దివ్యాంగులు, మాజీ మావోయిస్టులు, మాజీ సైనికులు, అందరికీ ఇళ్లు కట్టించడం సామాజిక న్యాయమేనని కవిత వివరించారు. తండ్రిగా కేసీఆర్‌ను విమర్శించలేదని, బీఆర్ఎస్ అధ్యక్షుడిపైనే విమర్శలు చేశామని చెప్పారు.
——————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



