– అన్నదాతకు అండగా రూ.1,476 కోట్ల రైతుభరోసా
– సాగునీటి ప్రాజెక్టులకు రూ.14,402 కోట్లతో పనులు
– రహదారుల అభివృద్ధికి రూ.670 కోట్లకు పైగా నిధులు
– పట్టు ఉత్పత్తిలో సిద్దిపేటకు రాష్ట్రంలోనే అగ్రస్థానం
– సిద్దిపేట జిల్లా ప్రగతి ప్రస్థానాన్ని ఆవిష్కరించిన మంత్రి పొన్నం
సిద్దిపేట, ప్రజాతంత్ర ఆగస్టు 15: సంక్షేమం-అభివృద్ధిని సమ్మిళి తం చేస్తూ ప్రజా పాలనలో సిద్దిపేట జిల్లాను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సిద్ధిపేట పోలీస్ కమిషనరేట్ పరేడ్ గ్రౌండ్స్లో శనివారం జాతీయ జెండాను ఎగురవేసిన మంత్రి.. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జిల్లాలో ప్రగతిని సమగ్రంగా వివరించారు.
రూ.1,476 కోట్ల రైతుభరోసా
జిల్లాలో సాధారణంగా సుమారు 1,93,500 ఎకరాల్లో వరి సాగవుతుందని, అయితే ఎల్న్ని కారణంగా ఆరుతడి పం. టలను సాగు చేయాలని రైతులకు సూచించారు. రైతుభరోసా పథకం కింద 3.25 లక్షల మంది రైతులకు ఎకరాకు రూ.6 వేల చొప్పున మొత్తం రూ.1,476 కోట్లు జమ చేసినట్లు తెలిపారు. రైతుబీమా కింద ఇప్పటివరకు 3,104 రైతు కుటుంబాలకు రూ. 155 కోట్లు అందించినట్లు వివరించారు. 2025-26 5 1,17,683 ລ້ 2 ລ້ 5,18,036 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని కొనుగోలు చేసి రూ.1,228 కోట్ల కనీస మద్దతు ధర చెల్లించినట్లు చెప్పారు. గత రబీ సీజన్ తో పోలిస్తే 1,36,619 మెట్రిక్ టన్నుల మేర అధికం గా ధాన్యం కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. జిల్లా సాగునీటి రంగాన్ని బలోపేతం చేసేందుకు మధ్య మానేరు నుంచి మల్లన్న సాగర్ వరకు అదనపు టీఎంసీ పనులను నాలుగు ప్యాకేజీలుగా విభజించి రూ.14,402 కోట్లతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. 8.230 టీఎంసీల సామర్థ్యంతో గౌరవెల్లి జలాశయం ద్వారా 1,06,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయని, ప్రధాన కాలువల పనులు 56 శాతం పూర్తయ్యాయని చెప్పారు. గౌరవెల్లి-గండిపల్లి మధ్య ఒక టీఎంసీ సామర్థ్యంతో చేపట్టిన ఎత్తిపోతల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.
పేదల సొంతింటి కల సాకారం
జిల్లాలో ఇప్పటివరకు 11,839 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10.754 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని, ఇప్పటికే రూ.255.20 కోట్ల నిధులు చెల్లించినట్లు వెల్లడించారు. గుడిసెల్లో నివసిస్తున్న 709 మంది లబ్దిదారులను గుర్తించి ఉన్నతస్థాయి పరిశీలనకు పంపినట్లు చెప్పారు. స్వయం సహాయ క సంఘాలకు వడ్డీలేని రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. స్వాతంత్య్ర వేడుకల సంద ర్బంగా 821 స్వయం సహాయక సంఘాలకు రూ.78 కోట్ల చెక్కు లను, మెప్మా ఆధ్వర్యంలో 64 మహిళా సంఘాలకు రూ.9.25 కోట్ల చెక్కులను మంత్రి అందజేశారు. ఇందిరా మహిళా శక్తి కా ర్యక్రమంలో భాగంగా జిల్లాలోని 23 మండల సమాఖ్యలు, జిల్లా సమాఖ్యకు 24 ఆర్టీసీ బస్సుల కొనుగోలుకు మొత్తం రూ.6.90 కోట్లు ప్రభుత్వం జమ చేసినట్లు తెలిపారు.
జలసిరితో నీటి భద్రతకు చర్యలు
ఎల్ నినోప్రభావంతో భూగర్భ జలాలు తగ్గుతున్నందున ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. జలసిరి కార్యక్రమం కింద ఇంటింటికీ ఇంకుడు గుంతలు, పంటకో పంటకుంట, ఊరూరా ఊటకుంటల నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. జూలై 2026 నాటికి జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 12.97 మీటర్లుగా నమోదైందని, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రతి 15 రోజులకు ఒకసారి భూగర్భ జలాల నివేదికను సమర్పిస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రూ.670.23 కోట్లతో 158.45 కిలోమీటర్ల మేర 13 రోడ్ల పనులు, రూ.6.15 కోట్లతో వంతెన నిర్మాణ పనులు చేపట్టినట్లు చెప్పారు. సిద్దిపేటలో నర్సాపూర్, ఎర్రచెరువు ప్రాంతాల్లో రూ.6.29 కోట్లతో భూగర్భ మురుగునీటి కాలువలు, రూ.2.50 కోట్లతో జంక్షన్ అభివృద్ధి, లేక్ రిజువెనేషన్, పార్కుల అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, జంక్షన్లు, మినీ ట్యాంక్ బండ్లు, పట్టణ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఆరోగ్యశ్రీ, రేషన్, పింఛన్లకు ప్రాధాన్యం
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆరోగ్య బీమా పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచడంతో పాటు అదనంగా 163 వ్యాధులను చేర్చి మొత్తం 1,835 వ్యాధులకు పథకం వర్తించేలా చేసినట్లు మంత్రి తెలిపారు. చేయూత పింఛన్ పథకంలో భాగంగా కొత్తగా 2.50 లక్షల మందికి పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. జిల్లాలో ప్రతి నెల 6,652 మెట్రిక్ టన్నుల ఉచిత సన్నబియ్యం పంపిణీ జరుగు తోందని తెలిపారు.రబీ ధాన్యం కొనుగోళ్లలో రైతులకు రూ. 1,228 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీతో ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించామని తెలిపారు. జిల్లాలో 1,590 మంది గీత వృత్తిదారులకు కాటమయ్య రక్షక కవచాలపై శిక్షణ ఇచ్చి, 1,590 రక్షక కవచాలను పంపిణీ చేసినట్లు చెప్పారు. 2026లో జిల్లావ్యాప్తంగా 17,700 ఈత, ఖర్జూర మొక్కలు నాటినట్లు తెలి పారు. మత్తు పదార్థాల వ్యతిరేకంగా విద్యా సంస్థలు, గ్రామాల్లో 110 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు.
మహాలక్ష్మితో మహిళలకు రూ.386 కోట్ల ఆదా
మహాలక్ష్మి పథకం ద్వారా 2023 డిసెంబర్ 15 నుంచి 2026 జూలై 31 వరకు జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక ఆర్టీసీ డిపోల పరిధిలో 9.93 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణించి రూ.386 కోట్లను ఆదా చేసుకున్నారని మంత్రి తెలిపారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి, ఉద్యోగ అవకాశాలను పెంచేందుకు ప్రతి నియోజకవర్గానికి ఒక ఏటీసీ మంజూరు చేసినట్లు చెప్పారు.
విద్యుత్ వినియోగదారులకు గృహజ్యోతి భరోసా
జిల్లాలో 6,08,580 మంది విద్యుత్ వినియోగదారులు ఉండగా గృహజ్యోతి పథకం కింద 2,06,044 మంది లబ్ది పొందుతు న్నారని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వం రూ.181 కోట్ల విద్యుత్ సబ్సిడీ అందించిందని వివరించారు. వేడుకల్లో భాగంగా స్వాతంత్య్ర సమరయోధులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఘనంగా సత్కరించారు. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏ ర్పాటు చేసిన శకటాలను, స్టాళ్లను పరిశీలించారు. జిల్లా అభి వృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





