– రేవంత్ కుటుంబీకుల ఆస్తుల పెరుగుదలపై ఎంక్వెరీ జరగాలి
– మాజీ మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 16: ‘మీ హయాంలో ఏం అవకతవకలు జరిగినయో.. మా హయాంలో ఏం జరిగినయో -మొత్తం మేం విచారణకు సిద్ధం. సుప్రీంకోర్టు జడ్జితో చేయిద్దామా ? హైకోర్టు సిట్టింగ్ జడ్జితో చేయిద్దామా రేవంత్ రెడ్డి’ అని మాజీ -మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమిటీలంటూ కాలయాపన చేస్తున్న సీఎం తన సొంత ఇల్లు విషయంలో మాత్రం ఎలాంటి కమిటీలు వేయకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ఆరోపించారు. కేటీఆర్ మీద, తన మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఎన్ని ఆరోపణలు చేసినా తాము విచారణకు సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి మొదలుకుని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 2023 డిసెంబర్ 7 నుంచి నేటి వరకు ‘భూభారతి’ వరకు జరిగిన ప్రతి అవకతవకపై సమగ్ర విచారణ జరిపించుకుందామని సవాల్ విసిరారు.
రేవంత్ కుటుంబం ఆస్తులపై విచారణ జరగాలి
తమ ఆస్తులతోపాటు రేవంత్ రెడ్డి, ఆయన తమ్ముళ్ల ఆస్తులు ఎలా పెరిగినాయనే దానిపై కూడా సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీకి సిద్ధమా అని హరీశ్ రావు సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి కుటుంబానికి ఏకంగా 308 ఎకరాల భూమి ఉందని తమకు సమాచారం వచ్చిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి భూమి పక్కనే ఓఆర్ఆర్ అలైన్మెంట్, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులు కూడా వచ్చాయని పేర్కొన్న ఆయన ఫ్యూచర్ సిటీ చుట్టూ, ఇతర ప్రాంతాల్లో ఉన్న భూముల వివరాలన్నింటినీ సేకరిస్తున్నామని స్పష్టం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





