కంటికి రెప్పలా మహిళలను కాపాడుకుంటున్నాం

•పదేళ్లలో మహిళల అభ్యున్నతిని బీఆర్‌ఎస్‌ ‌విస్మరించింది.
•దొరల పాలనను మళ్లీ రానీయొద్దు
•డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 8 : కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.  అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌ ‌పరేడ్‌ ‌గ్రౌండ్‌ ‌లో జరిగిన ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. గత పదేళ్ల పాటు పాలించిన బిఆర్‌ఎస్‌ ఏరోజు కూడా మహిళా అభ్యున్నతి గురించి కానీ, డ్వాక్రా సంఘాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదన్నారు. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ హయాంలో మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్దపీట వేశాం. వడ్డీ లేని రుణాలు ఇచ్చి కంటికి రెప్పలా కాపాడుకున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ప్రారంభించిన ఐకేపి పథకాన్ని గత బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.  ఐకెపి, స్వయం సహాయక సంఘాల గురించి మాట్లాడటానికి కూడా అసెంబ్లీలో గత పాలకులు ప్రతిపక్ష పార్టీ నాయకులకు సమయం ఇవ్వకుండా నియంతృత్వంగా వ్యవహరించారు.  పదేళ్ల రాష్ట్ర బడ్జెట్‌ ఆదాయం, చేసిన ఏడు లక్షల కోట్ల అప్పును పంది కొక్కుల తిన్నారే తప్ప.. మహిళల ఆర్థిక సాధికారతకు ఏమి చేయలేదు ఇందిరమ్మ రాజ్యం వొస్తే ఆశలు నెరవేరుతాయన్న మహిళల ఆకాంక్షలను ప్రజా ప్రభుత్వ నెరవేరుస్తున్నది.

సమాజంలో సగభాగం ఉన్న మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా విధానపరమైన నిర్ణయాలు తీసుకుని ఈ ఏడాది 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి నిర్ణయిస్తే ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ‌పార్టీ 20వేల కోట్లు ఇవ్వడం సాధ్యమేనా అంటూ హేళన చేస్తూ నవ్వారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ‌పాలకులు పందికొక్కుల్లా ప్రభుత్వ ఖజానాను తిన్నారు. పది సంవత్సరాల కాలంలో కనీసం 10 వేల కోట్లు కూడా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. కానీ 20వేల కోట్ల రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పిన ప్రజా ప్రభుత్వం 21 వేల కోట్ల రూపాయలు ఇచ్చింది. 21 వేల కోట్ల రూపాయలు వడ్డీ లేకుండా రుణాలు ఇవ్వడం అనేది ఆశామాషి కాదు. ఎంతో సంకల్పం, పట్టుదల, చిత్తశుద్ధి ఉంది కాబట్టే ఇది మాకు సాధ్యమైంది. మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు. ఇచ్చిన రుణాలను వ్యాపారం చేసుకోవడానికి ప్రజా ప్రభుత్వం మార్గం చూపించింది. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా ఆ బస్సులకు యజమానులను చేసిన ఘనత కూడా ప్రజా ప్రభుత్వానిది మహిళా సమాఖ్యలతో 600 బస్సులు కొనుగోలు చేయించిన చరిత్ర దేశంలో ఎక్కడ లేదు.

రాష్ట్రం తో పాటు దేశవ్యాప్తంగా వెలుగులు నింపే న్యూ ఎనర్జీ పాలసీని మన ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా సీఎం రేవంత్‌ ‌రెడ్డి  విద్యుత్‌ ‌శాఖ మంత్రిత్వ శాఖ బాధ్యతలు చూస్తున్న నన్ను, మంత్రి సీతక్క ను పిలిచి మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలను సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తిలో భాగస్వాములు చేయాలని చెప్పడంతో  1000 మెగావాట్ల సోలార్‌ ‌విద్యుత్తు ఉత్పత్తికి ఎంఓయూ చేయించాం దేశంలో బడా పెట్టుబడిదారులైన అంబానీ ఆదానిలే కాదు, రాష్ట్రంలో మహిళలు సోలార్‌ ‌విద్యుత్‌ ఉత్పత్తి చేయడం దేశంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతున్నది. బహిరంగ మార్కెట్లో మహిళలు గత బి ఆర్‌ ఎస్‌ ‌పాలనలో నూటికి పది రూపాయల చొప్పున వడ్డీ తెచ్చుకొని వాటిని తీర్చలేక బాధపడే దుష్ఠాంతం నుంచి వడ్డీ లేకుండా 21 వేల కోట్ల రుణాలు ఇచ్చి ఆర్థికంగా అభివృద్ధికి మహిళలు పునాది కావాలని ప్రభుత్వం ముందుకు వెళుతున్నది మహిళా స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తి చేసిన వస్తువులను మార్కెటింగ్‌ ‌చేసుకోవడానికి రాజధాని నడిబొడ్డున హైదరాబాద్‌ ‌హైటెక్‌ ‌సిటీలో విలువైన ప్రాంతాన్ని కేటాయించి డ్వాక్రా బజార్‌ ‌ప్రారంభించాం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ బడుల బాధ్యత అప్పగించాం. మహిళా శక్తి క్యాంటీన్లు పెట్టించాం.

విద్యార్థుల యూనిఫార్మస్  ‌కుట్టే పనిని అప్పగించి మహిళల ఆర్థిక అభివృద్ధికి బాటలు వేసిన ప్రభుత్వం మనది రాష్ట్రంలో మహిళలు తలెత్తుకొని మహాలక్ష్మి గా గౌరవంగా బతకాలన్నదే ప్రజా ప్రభుత్వ ఉద్దేశం, ఇందిరమ్మ రాజ్యం ఆలోచన.  గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన హరీష్‌ ‌రావు పెరిగాడే తప్ప, మహిళలకు కనీసం పది వేల కోట్ల రుణాలు ఇప్పించలేదు.  . ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే కోఠిలో ఉన్న మహిళా యూనివర్సిటీకి తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం  చేశాం. చాకలి ఐలమ్మ యూనివర్సిటీ లో చదివే పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు మెరుగైన విద్యా బోధన వసతులు కల్పించడానికి రూ. 500 కోట్లు ఖర్చు పెట్టడానికి నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు యూనివర్సిటీని సందర్శించారు.

పేద పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం 58 ఇంటిగ్రేటెడ్‌ ‌రెసిడెన్షియల్‌ ‌స్కూల్స్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడమే కాకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాం. డబుల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇస్తామని బిఆర్‌ఎస్‌ ‌లాగా గాలి మాటలు చెప్పడం లేదు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఏడాది ప్రతి నియోజకవర్గంలో 3500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించాం, పనులు ప్రారంభించాం. ఇది మా ప్రభుత్వానికి ఉన్న అంకితభావం లక్ష కోట్లకు పైగా మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేకుండా రుణాలు ఇచ్చి మహిళ అభ్యున్నతికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది రైతులు నిరుద్యోగులు మహిళలు అనేక వర్గాల ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాన్ని మీరు గుండెల్లో పెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో దొరల దోపిడిని గత పది సంవత్సరాలు చూశాం. దొరల పాలనను మళ్లీ రానీయొద్దు. పేదలు లబ్ది పొందే ఇందిరమ్మ రాజ్యాన్ని నిలబెట్టుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *