– 5 లక్షల మంది సైన్యం మృతి!
మాస్కో, మే 28: రష్యా`ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతోన్న యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఈ నేపథ్యంలో కొన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2022 నుంచి జరుగుతోన్న ఈ ఘర్షణల్లో రష్యాకు సైనికపరంగా భారీ నష్టం వాటిల్లినట్లు కనిపిస్తోంది. ఈ పోరులో ఐదు లక్షల మంది మాస్కో సైనికులు ప్రాణాలు కోల్పోయారని బ్రిటన్ నిఘా వర్గాల అంచనా.
మరోవైపు యుద్ధం ప్రారంభమైన నాటినుంచి తాము 55వేలమంది సైనికులను కోల్పోయినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఫిబ్రవరిలో వెల్లడించారు. ఇరువైపులా ప్రాణనష్టం భారీగానే ఉన్నా రెండు దేశాలు వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదనే ఆరోపణలున్నాయి. గత నాలుగేళ్లుగా డాన్‌బాస్ ప్రాంతంలోని ఉక్రెయిన్ స్థావరాలపై దాడుల కోసం రష్యా తన సైనికులను దశలవారీగా మోహరించింది. కొత్తగా చేరిన సైనికులు, జైళ్ల నుంచి నియమించుకున్నవారు ఈ ఘర్షణల్లో పాల్గొన్నారు. వారికి సరైన శిక్షణ లేకపోవడం.. యుద్ధ రంగంలో భారీగా ప్రాణనష్టానికి దారితీస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు అమెరికా, దాని మిత్ర దేశాలు సరఫరా చేసే క్షిపణి వ్యవస్థలు, ఫిరంగులు, అధునాతన డ్రోన్లను ఉక్రెయిన్ ఉపయోగిస్తోంది. కమాండ్ పోస్టులు, సైనిక సమÖహాలు లక్ష్యంగా జెలెన్‌స్కీ సైన్యం దాడులు చేస్తోంది. దాంతో ఈ నష్టం మరింత పెరిగిందనే అంచనాలున్నాయి. ఈ దాడులను ఎదుర్కొనేలా రష్యా సుశిక్షితులైన సైనికులను నియమించుకోలేకపోతున్నదని, విధుల్లో ఉన్నవారిని కాపాడుకునేలా ఎలాంటి రక్షణ కవచాలను సవిÖకరించలేకపోతోందని యÖకే నిఘా వర్గాలు అంచనా వేశాయి. ఇదిలా ఉంటే.. ఆర్మీలో యువతను చేర్చుకునేందుకు రష్యా ప్రభుత్వం వారికి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటిస్తోంది. ఇందులో భాగంగా రక్షణ శాఖతో ఒప్పందం కుదుర్చుకునే వారికి, వారి కుటుంబాలకు ఉండే రుణాల్లో 10 మిలియన్ రూబుల్స్ (సుమారు రూ.1.33కోట్లు) వరకు మాఫీ చేస్తామని హావిÖ ఇచ్చింది. కొత్తగా సైన్యంలో చేరాలనుకునే వారు కనీసం ఏడాదిపాటు కొనసాగుతానని హావిÖ ఇవ్వాల్సి ఉంటుందని, ఇందుకు సంబంధించిన నిర్ణయంపై అధ్యక్షుడు పుతిన్ సంతకం చేసినట్లు వార్తలు వచ్చాయి.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




