– సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
న్యూదిల్లీ, సెప్టెంబర్ 1 : నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ ఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నవారిపై నమోదైన ఎఫ్ఐఆర్ లను సుప్రీంకోర్టు రద్దు చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 142ను ఉపయోగించి కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆందోళనల్లో పాల్గొన్న యువత, విద్యార్థులకు భారీ ఊరట లభించినట్లైంది. ఈ మేరకు సుప్రీంకోర్టు మంగళవారం నిర్ణయం తీసుకుంది, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ తీర్పు వెల్లడించింది. దిల్లీ, అసోం, పశ్చిమ బెంగాల్, బిహార్ సహా వివిధ రాష్ట్రాల్లో ఆందోళనలపై నమోదైన ఎఫ్ఐఆర్ లను కోర్టు కొట్టివేసింది. దిల్లీ పరిధిలో జంతర్ మంతర్ వద్ద జూలై 20-25 వరకు జరిగిన నిరసనలపై 13 ఎఫ్ఐఆర్ లు నమోదయ్యా యి. అయితే ఈ ఆందోళనల్లో పాల్గొన్న వారిపై ఎలాంటి కేసులు ఉండవు. కానీ, గతంలో క్రిమినల్ కేసులు ఉన్నవారిపై మాత్రం ఎఫ్ఐఆర్ లు కొనసాగుతాయి. అలా 2,873 మందిపై నమోదైన ఎఫ్ ఐఆర్ లు మాత్రం కొనసాగుతాయని కోర్టు తెలిపింది. నీట్ ఆందోళనలపై అన్ని రాష్ట్రాల్లో నమోదైన కేసులు కొట్టివేయాలని ప్రభుత్వాలను ఆదేశించింది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అందించే విషయంపై కూడా సుప్రీంకోర్టు స్పందించింది. పరిహారం అందించేందుకు మూడు నెలల్లో విధి విధానాలు రూపొందిస్తామని ప్రభుత్వం తెలిపినట్టు కోర్టు పేర్కొంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





