స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

న్యూదిల్లీ, మే 28 : అంతర్జాతీయ మార్కెట్‌లో బులియన్ ధరలు పడిపోవడం, డాలర్ బలపడటం వంటి కారణాలతో భారత మార్కెట్‌లో పసిడి ధరలు దిగివచ్చాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు, కరెన్సీ మార్కెట్లు పుంజుకుంటున్నాయి. దీంతో బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,56,060గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2230 మేర తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,43,050గా ఉంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే రూ.2050 మేర తగ్గింది. రోవైపు వెండి ధరలు కూడా భారీ తగ్గుదల నమోదు చేశాయి. వెండి కిలోకు రూ.10 వేల మేర తగ్గింది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,85,000గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,75,000గా ఉండగా చెన్నైలో రూ.2,85,000గా, బెంగళూరులో రూ.2,75,000గా ఉంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *