విజయ్ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయం

– సొంత బలం లేకపోవడమే అతిపెద్ద బలహీనత
– తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు

చెన్నై, మే 19 : ప్రముఖ సినీ నటుడు విజయ్ నేతృత్వంలో కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వం ఎప్ప్పుడైనా కూలిపోవచ్చని డీఎంకే అధినేత, మాజీ సీఎం ఎం.కె.స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రభుత్వం పూర్తిస్థాయి మద్దతు లేక అస్థిరంగా ఉందని, ఎప్ప్పుడైనా కూలిపోయే అవకాశం ఉన్నందున డీఎంకే శ్రేణులు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ఏక్షణమైనా కూలిపోవచ్చు.. డీఎంకే పార్టీ కార్యకర్తలు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి అన్నారు. సొంతంగా 107 సీట్లు సాధించిన టీవీకే.. డీఎంకే మిత్రపక్షాల కాంగ్రెస్ 5 సీట్లు, సీపీఐ 2, సీపీఎం 2, వీసీకే 2 సీట్లు మద్దతుతో ప్రభుత్వం కొనసాగుతన్నదన్నారు. ప్రభుత్వానికి బయటినుంచి మద్దతు ఇస్తున్న తమ మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయÖఎంఎల్ మద్దతు నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా, లేదా తమిళనాడు స్పీకర్ గానీ, కోర్టులు గానీ రెబెల్ ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలను చివరికి అనర్హులుగా ప్రకటించినా రాజకీయ అస్థిరత ఏర్పడవచ్చని పేర్కొన్నారు. గతంలో ఎన్నికల పరాజయాల నుండి డీఎంకే ఎలా పుంజుకుందో గుర్తు చేశారు. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి.. ఈ ఓటమి తాత్కాలికమైందని, తాము మళ్లీ విజయం సాధిస్తామంటూ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. తమిళనాడులో సూర్యుడు (డీఎంకే గుర్తు) ఎప్పటికీ అస్తమించడు అని స్టాలిన్ స్పష్టం చేశారు. ఓటమికి వ్యక్తిగత బాధ్యత తీసుకుంటానని, సోషల్ విÖడియాలో పార్టీపై వచ్చే విమర్శలను తిప్పికొట్టాలన్నారు. ఈ విషయంలో టీవీకే చాలా ముందుందని పరోక్షంగా సూచించారు. ఒకప్ప్పుడు మనం టీ దుకాణాల్లో మాట్లాడిన రాజకీయాలను ఇప్ప్పుడు సోషల్ విÖడియా వేదికలపై మాట్లాడాలని సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *