ధర్మేంద్ర రాజీనామా.. యువత సాధించిన విజయం

– మాజీ మంత్రి హరీష్‌ ‌రావు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జులై 25 :  నీట్‌ ‌పేపర్‌ ‌లీకేజీ వ్యవహారంలో సీజీపీతోపాటు విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో వారి డిమాండ్ల మేరకు ధర్మేంద్ర ప్రధాన్‌ ‌తలొగ్గుతూ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తమ మూడు డిమాండ్లు నెరవేరడంతో ఆందోళన విరమిస్తున్నట్టు సీజీపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌హరీష్‌ ‌రావు స్పందించారు. తాజా సందర్భాన్ని దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయంగా హరీశ్‌ ‌రావు అభివర్ణించారు.. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోంది. విద్యార్థులందరికీ అభినందనలు.. అంటూ ఎక్స్‌లో ట్వీట్‌ ‌చేశారు. ఈ గొప్ప దేశంలోని విద్యార్థులు, యువత, ’జెన్‌-‌జెడ్‌’ ‌టీంకు అభినందనలు. ఈ విజయం మీదే. మీకు మా మద్దతును అందించినందుకు సంతోషంగా ఉంది.. అంటూ బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎక్స్ ‌ఖాతాలో ట్వీట్‌ ‌చేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *