పోరాటాలతోనే హైదరాబాద్‌కు విముక్తి

– మీడియా అకాడమి చైర్మన్ శ్రీనివాసరెడ్డి

హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17 : హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్‌లో విలీనం అయ్యేందుకు ప్రజా సంఘాలు ఉద్యమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి నిజాం నిరంకుశ పాలనపై తిరగబడ్డాయని మీడియా అకాడమి చైర్మన్ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. అప్పటి హైదరాబాద్ విలీన చరిత్రలో రజాకార్ల భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా జరిగిన రైతాంగ సాయుధ పోరాటాల గురించి వివరించారు. భారత దేశానికి 1947 ఆగష్టు 15వ తేదీన స్వాతంత్య్రం వచ్చినప్పటికీ హైదరాబాద్ ప్రాంతానికి మాత్రం 13 నెలలకు సెప్టెంబర్ 17వ తేదీన వచ్చిందని ఆయన గుర్తు చేశారు. ఈ ప్రస్థానంలో అనేకమంది పాల్గొని త్యాగాలు చేశారని, ప్రాణాలు కోల్పోయారని, వారి పోరాటాల ఫలితమే నేడు మనం జరుపుకుంటున్న ఈ పతాకావిష్కరణ కార్యక్రమం అని చెప్పారు. ఇది నైజాం నిరంకుశ పాలన నుండి మనకు విముక్తి కలిగిన దినంగా గుర్తుంచుకోవాలన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న నిర్వహించడం శుభ పరిణామం అన్నారు. రాబోయే కాలంలో హైదరాబాద్ అభివృద్దిలో ఫ్యూచర్ సిటీ పేరుతో అనేక పరిశ్రమల స్థాపన, అర్బన్ డెవలప్‌మెంట్, క్రీడా రంగం, ఫార్మా రంగం, ఐటీ వంటి అనేక సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. కార్యక్రమంలో మీడియా అకాడమి కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వర రావు, మేనేజర్ శైలేశ్వర్ రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *