రేపు హైదరాబాద్‌కు కేంద్ర మంత్రి నడ్డా

– ఎయిమ్స్‌పై సమీక్షించనున్న మంత్రి

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 8: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాష్ట్రంలో గురువారం పర్యటించనున్నారు. పలు కార్యక్రమాలకు ఆయన హాజరుకానున్నారు. ఈ మేరకు నడ్డా పర్యటన షెడ్యూల్‌ ‌ఖరారైంది. ఉదయం 10:55 నిమిషాలకు శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బీబీనగర్‌ ఎయిమ్స్‌కు వెళ్లి 1:30 గంటల వరకు సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. 2:45 గంట‌ల‌కు బీబీనగర్‌ ఎయిమ్స్ ‌నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి బయల్దేరతారు. మధ్యాహ్నం 3:30 నుంచి 5 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో నడ్డా కీలక సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 5:10 గంటలకు తాజ్‌ ‌డెక్కన్‌కు వెళ్తారు. 5:30 నుంచి 7 గంటల వరకు తాజ్‌ ‌డెక్కన్‌లో మేధావులతో సమావేశం అవుతారు. తాజ్‌ ‌డెక్కన్‌ ‌నుంచి 7:10 నిమిషాలకు బయలుదేరి శంషాబాద్‌ ఎయిర్‌ ‌పోర్ట్‌కు వెళ్లి రాత్రి 9 గంటలకు దిల్లీకి ప‌య‌న‌మ‌వుతారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *