ఇది ముమ్మాటికీ విద్యార్థుల విజయం

– గాంధీ నుంచే తాము శాంతిని నేర్చుకున్నాం
– ధర్మేంద్ర ప్రధాన్‌ ‌రాజీనామాపై అభిజిత్‌ ‌దీప్కే

న్యూదిల్లీ, జూలై 25: నీట్‌ ‌పేపర్‌ ‌లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్‌ ‌జనతా పార్టీ(సీజేపీ) చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌  ‌తన పదవికి రాజీనామా చేశారు. దీనిపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఇది విద్యార్థుల విజయం అంటూ ‘ఎక్స్‌’లో చేసింది. ప్రధాన్‌ ‌రాజీనామాతో దిల్లీలోని జంతర్‌ ‌మంతర్‌ ‌వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ ‌దీప్కే మాట్లాడుతూ ‘శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుంది.. దీన్ని గాంధీజీ నుంచి నేర్చుకున్నా.. ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృథాగా పోలేదు.. విద్యార్థుల పోరాటం ఫలించింది.. వారి సత్తా ఏంటో తెలిసింది.. ఈ విజయం విద్యార్థులందరిది.. ప్రజాస్వామ్యం అంటే ఇదే’ అని ఆనందం వ్యక్తం చేశారు. ‘మాకు రాజకీయాలు అవసరం లేదు.. మా డిమాండ్లలో ఒకటి నెరవేరింది.. మిగతా రెండూ నెరవేరే వరకు వేచి చూస్తాం.. విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.. విద్యార్థులపై పెట్టిన అన్ని కేసులు పూర్తిగా ఎత్తివేయాలి.. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదు.. ఈ సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ చేద్దాం అని సీజేపీ నేతలు యువతకు పిలుపునిచ్చారు.

నాకు టైఫాయిడ్ వచ్చింది : అభిజిత్ దీప్కే

సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అనారోగ్యానికి గురయ్యారు. నీట్ పేపర్ లీక్‌పై నెల రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టిన ఆయనకు టైఫాయిడ్ వచ్చింది. తనకు టైఫాయిడ్ వచ్చిన విషయాన్ని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఇటీవల వైద్య పరీక్షలు చేయించగా వ్యాధి నిర్దారణ అయిందన్నారు. ప్రస్తుతం రోజుకు రెండుసార్లు ఇంట్రావీనస్ చికిత్స తీసుకుంటున్నట్లు దీప్కే పేర్కొన్నారు. తాను అనారోగ్యానికి గురైనా విద్యా వ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ చేపట్టిన నిరసన దీక్ష మాత్రం కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు దీప్కేతోపాటు పలువురు సీజేపీ మద్దతుదారులు, కార్యకర్తలు కూడా అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. ‘అందరికీ నమస్కారం. కొన్ని రోజులుగా నా ఆరోగ్యం బాగోలేదని మీ అందరికీ తెలుసు.. అందుకే రక్త పరీక్షలు చేయించాను.. రిపోర్టుల్లో టైఫాయిడ్ అని నిర్దారణ అయింది.. చికిత్స కొనసాగుతోంది.. ఉదయం, సాయంత్రం ఐవీ డ్రిప్స్ పెడుతున్నారు.. దేశవ్యాప్తంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బొద్దింకలందరికీ నేను నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా.. మీ వల్లే ఉద్యమం విజయవంతమైంది..  అందరికీ చాలా ధన్యవాదాలు.. ఈ ఉద్యమాన్ని ఇంత పెద్ద విజయంగా మార్చినందుకు అందరికీ అభినందనలు’ అని అభిజీత్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *