– ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగందని పలువురు ఎంపీల ఆరోపణ
చెన్నై, ఆగస్ట్ 6: తమిళనాడులో రాష్ట్ర గీతమైన ’తమిళ్ తాయ్ వాళ్తు’ ఆలాపన ప్రొటోకాల్ మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. తిరునెల్వేలిలో జరిగిన మనోన్మణీయం సుందరనార్ యూనివర్సిటీ 33వ స్నాతకోత్సవంలో ప్రొటోకాల్ ఉల్లంఘన జరిగిందని ఎంపీలు ఆరోపించారు. కార్యక్రమంలో ముందుగా ‘వందే మాతరం’, అనంతరం జాతీయ గీతం, ఆ తర్వాత మూడో స్థానంలో ’తమిళ్ తాయ్ వాళ్తు’ ఆలపించడాన్ని వారు తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్ర గీతాన్ని ఈ విధంగా మూడో స్థానంలో ఉంచడం తమిళ ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేకాక ఆ గీత రచయిత సుందరనార్‌ను కూడా అవమానించడమేనని లేఖలో పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం, ఎంపీ కార్తి చిదంబరం, చిరుతైగల్ కచ్చి నేత తిరుమావలవన్‌తోపాటు మొత్తం 21మంది ఎంపీలు గవర్నర్‌కు సంయుక్తంగా లేఖ రాశారు. ఐదు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ప్రభుత్వ, విశ్వవిద్యాలయ కార్యక్రమాల్లో ప్రారంభంలో ’తమిళ్ తాయ్ వాళ్తు’, ముగింపులో జాతీయ గీతం ఆలపించాలని వారు డిమాండ్ చేశారు. వరుసగా మూడోసారి ప్రొటోకాల్‌లో మార్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని పేర్కొంటూ భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావులేకుండా రాజ్‌భవన్ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




