అం‌త్యక్రియలకు వచ్చి..

– చెరువులోకి దిగి ఇద్దరు మృత్యువాత

సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : ‌జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. బంధువు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వచ్చిన గణెష్‌ (30), ‌మునిరాజు (58) ప్రాణాలు కోల్పోయారు. అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇద్దరూ చెరువులో స్నానం చేసేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గణెష్‌కు ఒక్కసారిగా మూర్ఛ రావడంతో అదుపు తప్పి నీటిలో పడిపోయాడు. చెరువులో మునిగిపోతున్న గణెష్‌ను గమనించిన మునిరాజు కాపాడేందుకు వెంటనే నీటిలోకి వెళ్లాడు. అయితే గణెష్‌ను రక్షించే ప్రయత్నంలో మునిరాజు కూడా నీటిలో మునిగిపోయాడు. ఇద్దరూ చాలాసేపు బయటకు రాకపోవడంతో అక్కడ ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. వెంటనే సమాచారం అందడంతో స్థానికులు చెరువు వద్దకు చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీసినట్లు సమాచారం. అంత్యక్రియలకు హాజరైన కుటుంబాల్లో ఈ ఘటన మరో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *