కరీంనగర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 13 : బీర్ పూర్ మండల కేంద్రంలో ఏసీబీ డీఎస్పీ గట్ల మహేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం బీర్పూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడి నిర్వహించారు. ఓ బాధితురాలి నుంచి రూ.30 వేల లంచం తీసుకుంటున్న గిరిధావర్(ఆర్) రాహుల్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనపై ఏసీబీ అధికారులు విచారణ చేపట్టారు. కాగా ఆర్‌ఐ రాహుల్ గతంలో కథలాపూర్ ఆర్‌ఐ-1 గా విధులు నిర్వహించగా సర్టిఫికెట్ల జారీలో విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడంతో బీర్పూర్ కు బదిలీ చేశారు. కాగా ,ఏసీబీ అధికారుల విచారణ కొనసాగుతోంది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు