– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసు కేసు
హైదరాబాద్, ప్రజాతంత్ర,ఆగస్ట్ 13 : అప్పు తీర్చలేదనే కోపంతో బాలికను తీసుకెళ్లేందుకు ఓ వ్యక్తి ప్రయత్నించాడు. అయితే బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. హనుమాన్ నగర్‌లో అద్దె ఇంట్లో ఈ కుటుంబం నివాసం ఉంటోంది. మానికేశ్వరి నగర్‌లో నివాసం ఉన్న సమయంలో పరిచయస్తుడి వద్ద బాలిక కుటుంబ సభ్యులు రూ.30 వేల అప్పు తీసుకున్నారు. అప్పు తిరిగి చెల్లించకపోవడంతో ఆ వ్యక్తి బుధవారం ఇంటికి వచ్చాడు. డబ్బులు ఇవ్వాలంటూ కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చే వరకు వారి కుమార్తెను తీసుకెళ్తానంటూ అతడు బెదిరించాడు. దీంతో ఆ వ్యక్తిపై బాధిత కుటుంబం పోలీసులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేసింది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. బాలికను తీసుకెళ్లేందుకు ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు