- దర్యాప్తుకు సహకరించాలని హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9:కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ కు ఊరట లభించింది. పోక్సో కేసులో అతడికి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన ఉన్నత న్యాయస్థానం.. దర్యాప్తునకు సహకరించాలని భగీరథ్‌ను ఆదేశించింది. పేట్ బషీరాబాద్ పీఎస్‌లో అతడిపై పోక్సో కేసు నమోదైంది. మే 16న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియడంతో తీర్పును హైకోర్టు వాయిదా వేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ భగీరథ్ విద్యార్థి అని, 45 రోజులకుపైగా జైలులో ఉండటంతో జీవితంలో చాలా కోల్పోయాడని, పరస్పర అంగీకారంతో జరిగిన దానిపై కేసులు నమోదు చేయడం చెల్లదని, ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు పలు తీర్పుల్లో వెల్లడించాయని కోర్టు దృష్టికి తెచ్చారు. బెయిల్ మంజూరు చేస్తే కోర్టు విధించిన షరతులకు కట్టుబడి ఉంటారన్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ మే 8న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వెంటనే వాంగ్మూలాల సేకరణ మొదలైందన్నారు. దర్యాప్తు దాదాపు పూర్తికావచ్చిందని, గడువులోగా అభియోగ పత్రాన్ని దాఖలు చేస్తామని చెప్పారు. ఈ దశలో బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేస్తారన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి జస్టిస్ సుజన భగీరథ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.