రోడ్డు ప్రమాదంలో యువతి మృతి

– స్కూటీని వెనక నుంచి ఢీకొన్న వాటర్ ట్యాంకర్ లారీ
– గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపంలో ఘటన

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 10 : గచ్చిబౌలిలో శుక్ర వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి మృతిచెం దగా, మరో యువతి తీవ్రంగా గాయప డింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గచ్చిబౌలిలోని ఓ హాస్టల్లో ఉంటూ సేల్స్ గర్ల్ గా పనిచేస్తున్న మల్లం భవాని (23), అంజయ్యనగర్ లోని హాస్ట ల్లో ఉంటున్న తన స్నేహితురాలు సుభా షిని (30)తో కలిసి యాక్టివాపై ట్రిపుల్ ఐటీ నుంచి అంజయ్యనగర్ వైపు వెళ్తున్నారు. ఈక్రమంలో గచ్చిబౌలి ఫ్లైఓవర్ సమీపానికి రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన వాటర్ ట్యాంకర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భవాని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందింది. సుభాషిని తీవ్రంగా గాయపడగా స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాటర్ ట్యాంకర్ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *