దాడులు చేస్తున్నా మారని తీరు

– క్లౌడ్ కిచెన్లో గడువు ముగిసిన, కుళ్లిపోయిన పదార్థాలతో వంటలు
– వరుస తనిఖీల్లో బయటపడుతున్న పరిశుభ్రత లోపాలు
– యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

హైదరాబాద్, జూలై 10 (ప్రజాతంత్ర): నగరంలోని కొండాపూర్లో ఉన్న ఓ ప్రముఖ క్లౌడ్ కిచెన్లో గడువు ముగిసిన, కుళ్లిపోయిన ఆహార పదార్థాలతో వంటలు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో వెలుగుచూసింది. ఈ కేంద్రం నుంచి పలు ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ బ్రాండ్ల పేర్లతో ఆహారం సరఫరా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీల్లో గడువు ముగిసిన పెరుగు, గ్రేవీతో పాటు పాడైపోయిన పదార్థాలను గుర్తించారు. అపరిశుభ్రమైన వంటశాల, వాష్రూమ్లు, సిబ్బంది నకిలీ వైద్య ధృవపత్రాలు వంటి పలు లోపాలు బయటపడటంతో యాజమాన్యానికి నోటీసులు జారీ చేసి, గడువు ముగిసిన పదార్థాలను అక్కడికక్కడే నిర్వీర్యం చేశారు. నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల అంశంపై ప్రత్యేక విచారణ చేపడతామని అధికారులు తెలిపారు. ఇదే సందర్భంగా నగరంలోని పలు హోటళ్లు, క్లౌడ్ కిచెన్లు, కాలేజీ మెస్లు, ఇన్స్టా మార్ట్ గోదాముల్లో నిర్వహించిన తనిఖీల్లో కూడా కుళ్లిపోయిన ఆహార పదార్థాలు, ఎలుకల రెట్టలు, గడువు ముగిసిన వస్తువులు, పరిశుభ్రత లోపాలు గుర్తించినట్లు వెల్లడించారు. ఆహార పదార్థాల తయారీ, నిల్వలో నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లం ఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఫుడ్ సేఫ్టీ అధికా రులు హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *