– ఒకరి మృతి, 14 మందికి గాయాలు
మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మే 28: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సును బెంగుళూరు వైపు వెళ్తున్న మరో ట్రావెల్స్ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, మరో 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే జడ్చర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ కి తీవ్ర గాయాలు కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వ్యక్తిని తిరుపతి రిటైర్డ్ డీఎస్పీ సాంబశి వారెడ్డి కుమారుడు అశోక్ రెడ్డిగా గుర్తించారు. అశోక్ రెడ్డి మృతి వార్తతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ప్రమాదానికి అధిక వేగం, డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదం కారణంగా కాసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడగా పోలీసులు వాహనాలను మళ్లించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




