కామారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 16 : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం చింతామన్‌పల్లి గ్రామంలో యువకుడి ఆత్మహత్య కలకలం రేపింది. రంగబోయిన సందీప్ (23) గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గతంలో పోక్సో కేసులో నిందితుడైన ఇతను ఇటీవలే జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చాడు. అప్పటి నుంచి బాలిక తల్లిదండ్రులు తనను తరచూ వేధిస్తూ బెదిరింపులకు గురిచేస్తున్నారనే ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తీవ్ర మనస్తాపానికి గురై ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. గ్రామ శివారులో సందీప్ మృతదేహం వేలాడుతుండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పరిశీలించారు. బాలిక కుటుంబ సభ్యుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని సందీప్ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కారణం వల్లే తమ కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోమకొండ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




