హైదరాబాద్‌ ‌నుంచి కర్నాటకకు రేషన్‌ ‌బియ్యం

– ఐదుగురు వ్యక్తుల ముఠాను పట్టుకున్న పోలీసులు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూలై 16: తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ ‌బియ్యం ముఠా గుట్ట రట్టు చేశారు గచ్చిబౌలి పోలీసులు. ఈ ముఠాకు చెందిన ఐదుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ ‌చేశారు. వారి నుంచి 220 టన్నుల రేషన్‌ ‌బియ్యం, 40 బ్యాగుల గోధుమలు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ బియ్యం, గోధుమలు తరలిస్తున్న 4 లారీలు, 4 టాటా ఏస్‌ ‌వాహనాలను సీజ్‌ ‌చేసినట్లు చెప్పారు. నిందితులపై కంట్రోల్‌ ‌యాక్ట్ – 2016 ‌కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. గౌలిదొడ్డి నుంచి కర్ణాటకకు ఈ రేషన్‌ ‌బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకున్నామని పేర్కొన్నారు. నిందితులను విచారిస్తున్నామని పేర్కొన్నారు. వారి నుంచి వివరాలు రాబడుతున్నట్లు చెప్పారు. సివిల్‌ ‌సప్లయ్స్ ‌విజిలెన్స్ ‌విభాగంలోని అధికారులతోపాటు గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఈ దాడి నిర్వహించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *