వీర్‌ సాహిబ్జాదేల త్యాగం సదా స్మరణీయం

– ‘వీర్‌ బాల్‌ దివస్‌’లో బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: వీర్‌ సాహిబ్జాదేల వీరమరణం భారతీయ నాగరికత చరిత్రలో అత్యంత ప్రేరణాత్మక అధ్యాయాలలో ఒకటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌ రావు పేర్కొన్నారు. వయస్సు ధైర్యానికి అడ్డుకాదని, విశ్వాసం, గౌరవం, అణచివేతకు వ్యతిరేకంగా నిలబడే అత్యున్నత విలువలు చిన్న వయస్సులోనూ ఎలా ప్రతిఫలించగలవో వారి త్యాగం శాశ్వత స్మరణగా నిలుస్తుందని అన్నారు. వీర్‌ బాల్‌ దివస్‌ సందర్భంగా సికింద్రాబాద్‌ గురుద్వారాలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన భక్తులు, సిక్కు సమాజ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వీర్‌ సాహిబ్జాదేలు సాహిబ్జాదా బాబా జోరావర్‌ సింగ్‌ జీ, సాహిబ్జాదా బాబా ఫతేప్‌ా సింగ్‌ జీలకు ఘన నివాళులర్పించారు. వీర్‌ బాల్‌ దివస్‌ స్మరణ దినం మాత్రమే కాదని, ధైర్యం, ధర్మం, అన్యాయానికి ఎదురు నిలిచే భారతదేశ శాశ్వత విలువలను పునఃప్రతిపాదించే ముఖ్యమైన దినమని అన్నారు. 2014 నుంచి సిక్కుల సంక్షేమం, గౌరవం, సాధికారత కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఇది నిరంతరమైన, సార్థకమైన విధానాత్మక చర్యల ద్వారా అమలవుతోందని స్పష్టం చేశారు. 1984 సిక్కు వ్య‌తిరేక‌ అల్లర్ల బాధితులకు న్యాయం అందించడంలో మోదీ ప్రభుత్వ నిర్ణయాత్మక చర్యలు అత్యంత కీలకమైనవన్నారు. లంగర్‌ కార్యక్రమాలకు ఉపయోగించే ఆహార పదార్థాలపై జీఎస్టీ మినహాయింపు కల్పించే సేవా భోజ్‌ యోజన వంటి ముఖ్యమైన పథకాలను ప్రస్తావించారు. పవిత్ర క్షేత్రాలలో ఒకటైన కర్తార్పూర్‌ సాహిబ్‌ను ఏడాది పొడవునా దర్శించుకునే అవకాశం కల్పించిన చరిత్రాత్మక కర్తార్పూర్‌ కారిడార్‌ సిక్కు సమాజం ఏళ్ల‌నాటి కలను సాకారం చేసిందన్నారు. ఇవి ప్రధాని మోదీ సబ్కా సాథ్‌, సబ్కా వికాస్‌, సబ్కా విశ్వాస్‌ అనే ఆలోచనకు ప్రతిబింబమని, ప్రతి సమాజం విశ్వాసం, వారసత్వం, ఆకాంక్షలకు గౌరవం ఇస్తూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నాయని చెప్పారు. సిక్కు సమాజంతో అనుసంధానం, అవగాహన పెంపొందించడంలో మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జగ్మోహన్‌ సింగ్‌ సేవలను అభినందించారు. వీర్‌ సాహిబ్జాదేల వారసత్వం ప్రతిబింబించే ధైర్యం, సేవాభావం, జాతీయ ఐక్యత విలువలను భార‌తీయులంద‌రూ ఆచరించాలని రామచందర్‌ సూచించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page