దేశ విభజనతో ఎన్నో జీవితాలు చిన్నాభిన్నం

– పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’పై మోదీ

న్యూదిల్లీ, ఆగస్టు 14 : దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసిందని ప్రధాని మోదీ అన్నారు. ఆ విభజన కారణంగా నష్టపోయిన బాధితుల ధైర్యాన్ని ప్రధాని కొనియాడారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు రోజున భారత ప్రభుత్వం ‘పార్టిషన్ హరర్స్ రిమెంబరెన్స్ డే’ను నిర్వహిస్తోంది. దేశ విభజన, సామూహిక వలసల అనంతరం జరిగిన అల్లర్లలో ప్రాణాలు కోల్పోయిన వారికి గుర్తుగా 2021 నుంచి కేంద్రం దీనిని పాటిస్తోంది. ఈ విభజన ఎన్నో జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది.. ఎన్నో కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి.. నాడు విభజన గాయాల బాధితులు ప్రియమైన వారిని కోల్పోయారు.. అంతులేని బాధను అనుభవించారు.. అంతటి భయానక పరిస్థితుల నుంచి ప్రజలు తమ జీవితాలను పునర్నిర్మించుకున్నారు.. ప్రతికూలతలను విజయంగా మార్చుకున్నారు.. దేశ ప్రగతికి దోహదపడ్డారు.. సామరస్యం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షించడానికి, వికసిత్ భారత్ నిర్మాణానికి సమష్టిగా కృషి చేసేలా వారి జీవితాలు మనందరికీ స్ఫూర్తినిస్తాయ’ని మోదీ పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *