స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టో 25 9 : వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న రెవెన్యూ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లను బదిలీ చేసింది. జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా పనిచేస్తున్న బీ.రాజుగౌడ్ ను నిజామాబాదు, తెలంగాణ సీఈవో కార్యలయంలో డిప్యూటేషన్ పై ఉన్న స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ ఎన్. ప్రసూనాంబ‌ను జగిత్యాల అడిషనల్ కలెక్టర్ గా బదిలీ చేశారు. ఆర్అండ్ బీ, హౌజింగ్ లో పనిచేస్తున్న డి.వెంకట మాధవరావును నిర్మల్ అడిషనల్ కలెక్టర్,గా మహబూబ్ న‌గ‌ర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్ట‌ర్‌గా ఉన్న పి.రాంరెడ్డిని వనపర్తి డీఆర్వోగా బదిలీ చేశారు. పో స్టింగ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న పి.యాదగిరిని మహబూబ్ నగర్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా, మోహన్ సింగ్ ను రాజన్న సిరిసిల్ల జిలా్ల‌ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పి.పద్మప్రియను మెట్రో రైలు విభాగానికి డిప్యూటీషన్ పై బదిలీ చేశారు. సీహెచ్. కృష్ణయ్య ను మేడ్చల్ స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *