- రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్
- వరంగల్ ప్రెస్ క్లబ్‌లో లయన్స్ క్లబ్ 320ఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు ఘనంగా సన్మానం
హన్మకొండ, ప్రజాతంత్ర, అక్టోబర్ 9 : సమాజ అభివృధ్దిలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని, చురుకైన, అత్యంత విలువైనదని రాష్ట్ర సమాచార అదనపు సంచాలకులు డిఎస్. జగన్ అన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్ వేదికగా లయన్స్ క్లబ్ 320ఎఫ్ జిల్లా ఆధ్వర్యంలో జల్లా జర్నలిస్టుల సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఎస్. జగన్ పాల్గొన్నారు.
వరంగల్‌లో సుదీర్ఘ కాలంగా పని చేసిన తాను జర్నలిస్టు సోదరులతో జిల్లా అభివృద్ధి పరంగా ఎన్నో సూచనలు తీసుకోవడం, వాటిని జిల్లా అధికారులకు అందజేయడం వల్ల ప్రభుత్వ కార్యక్రమాల అమలు విజయవంతమైందని తెలిపారు. దేశ ప్రజలు మెచ్చే జాతర మేడారం విజయవంతం కావడానికి జర్నలిస్టుల కృషి గొప్పదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటి తరం, నేటి తరం జర్నలిస్టుల కలయిక గొప్ప అనుభూతిగా వర్ణించారు.
కాగా, లయన్స్ ఇంటర్నేషనల్ ఎన్నడూ లేని విధంగా వరంగల్ జిల్లాలో జిల్లా పూర్వ పౌర సంబంధాల అధికారులతో పాటు వివిధ హోదాల్లో స్థిరపడిన అధికారులను, గత మూడు దశా బ్దాల కాలంగా పనిచేస్తున్న సీనియర్ జర్నలిస్టులను ప్రోగ్రాం కమిటీ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు పి.వి.మదన్ మోహన్ అధ్యక్షతన ఘనంగా సత్కరించారు.. ఈ సందర్భంగా సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా పౌర సంబందాల అధికారిగా చాలా కాలంగా పనిచేసిన తనకు జర్నలిస్టు సోదరులతో ఎంతో బలమైన అనుబంధం వుందని, జిల్లాలో కనుమరుగైన కళా రంగ సంస్థలను ఆదుకునేందుకు కాకాతీయ కళా వైభవం, శతరూప కార్యక్రమాలను నిర్వహిం చిన సంధర్భాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల విజయంలో పాత్రికేయుల కృషి మరువరానిదని పేర్కొన్నారు. వరంగల్లులో ఏపిఆర్ఓ గా ప్రారంభమైన ప్రస్థానం మూడు దశాబ్దాలు కొనసాగి ఈ జిల్లాతో విడదీయరాని సంబంధం అని పేర్కొన్నారు. సమాచార శాఖ పూర్వ జాయింట్ డైరెక్టర్ మనోహరాచారి చాలకాలం తరువాత లయన్స్ క్లబ్ కార్యక్రమం వల్ల వరంగల్ కు వచ్చే అవకాశం దక్కిందని తెలిపారు.
జిల్లా లయన్స్ గవర్నర్ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఏటా క్యాలండర్ ఆఫ్ ఈవెంట్స్ లో భాగంగా సమాజసేవలో ముం దుండే జర్నలిస్టులు, వైద్యులు, ఇంజనీర్లను సత్కరించడం తమ ఆనవాయితీ అని తెలిపారు. ఈ సందర్భంగా తమ సంస్థ సభ్యు లు పి.వి.మదన్ మోహన్ జర్నలిస్టు సత్కార కార్యక్రమాన్ని భుజాన వేసుకొని అరవై మంది జర్నలిస్టులతో పాటు పూర్వ డిపిఆర్వోలను భాగస్వామ్యం చేయడం మహత్తర విషయమని, గ తంలో స్వచ్చంద సంస్థ అధ్యక్షుడిగా తన ప్రయాణం డిపిఆర్ఓలతో కొనసాగిందని గుర్తుచేశారు.
ఈ కార్యక్రమ చైర్మన్, సీనియర్ జర్నలిస్టు లయన్ మదన్ మో హన్ మాట్లాడుతూ గత నాలుగు దశాబ్దాల జర్నలిజం కాలంలో అనేక మంది జర్నలిస్టులు తన పట్ల సోదరభావం ప్రకటించారని, అందుకే లయన్స్ క్లబ్ ద్వార అందరినీ కలవాలనే తలంపే జర్నలిస్టు హానరింగ్ అని, ఇందులో ప్రత్యేకత మానస పుత్రిక ప్రెస్ వేదిక ద్వారా మిత్రులను కలవడం, ఆకాశావాణి విలేకరిగా తన జీవన ప్రస్థానం కొనసాగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విడిజి1 రమణా రెడ్డి, పిఆర్వో అజిత్, కోఆర్డినేటర్ టి.నరేందర్ పిడిజిలు కన్నా, పొట్లపల్లి శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్ష కార్యదర్శులు వైద్యం రాజ గోపాల్, నరహరి, పరికిపం డ్ల వేణు అవార్డు గ్రహీతలు కేశవమూర్తి, లెనిన్, అనీల్, సదయ్య, సుధాకర్, రాజనారాయణ,రమణ, గుల్షన్, సోని, దయాసాగర్, రవీందర్ రావు, కెకె, క్రిష్ణ మోహన్, పెద్దీశ్, రాజేంద్రప్రసాద్, మనోహర్ రావు, వెంకటరత్నం, సాయిరాం, యంసాని శ్రీనివా స్, వంశీ మోహన్ సుదీర్ఘకాలంగా ఫోటో జర్నలిస్టు సేవలందిన సకినాల శ్యాం, దాసరి శ్రీనివాసులును సంస్థ ప్రత్యేకంగా సన్మానించారు.





