ట్రైనీ ఐపిఎస్‌ ‌కేసును సిబిసిఐడికి బదిలీ చేయాలి

-సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం.‌నాగేశ్వరరావు సూచన
హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్10:‌ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలని సీబీఐ మాజీ డైరెక్టర్‌ ఎం. ‌నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌కు ఈ-మెయిల్‌ ‌పంపారు.. ఈ కేసును సీబీసీఐడీ లేదా మరో స్వతంత్ర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఉదయ్‌ ‌కృష్ణారెడ్డి అరెస్టుపై పలు ప్రశ్నలను నాగేశ్వరరావు లేవనెత్తారు. పోష్‌ ‌చట్టం కింద అంతర్గత విచారణ పూర్తికాకముందే ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని ఎందుకు అరెస్టు చేశారని నాగేశ్వరరావు ప్రశ్నించారు. అతడిని అరెస్టు చేసే సమయంలో దర్యాప్తునకు సహకరించాడా?, సాక్షులను ప్రభావితం చేస్తాడా?, పరారయ్యే అవకాశముందా? వంటి అంశాలను పరిశీలించారా? అని నిలదీశారు. తొలుత బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుల్లో అత్యాచారం, హత్యాయత్నం ఆరోపణలు లేవని ప్రస్తావించారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ ‌రిపోర్టులో తీవ్ర ఆరోపణలు చేర్చారని పేర్కొన్నారు. హైదరాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌వీసీ సజ్జనార్‌ ‌స్వయంగా ఉదయ్‌ ‌కృష్ణారెడ్డిని విచారించారని తెలిపారు. ఈ కేసు దర్యాప్తుపై తలెత్తిన అనుమానాలకు స్వతంత్ర విచారణతోనే తెరపడుతుందని డీజీపీకి సీబీఐ మాజీ డైరెక్టర్‌ ‌నాగేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *