హాస్టల్‌లో విద్యార్థిపై తోటి విద్యార్థుల దాడి

– కామారెడ్డికి చెందిన విద్యార్థి పరిస్థితి విషమం

మేడ్చల్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10 : ‌మేడ్చల్‌లోని శ్రీ చైతన్య పాఠశాలకు సంబంధించిన హాస్టల్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి విద్యార్థిపై సహచర విద్యార్థులు దాడికి పాల్పడారు. కామారెడ్డికి చెందిన విద్యార్థి అభిషేక్‌ ‌రెడ్డిపై 8 నుంచి 10 మంది దాడి చేసినట్లు సమాచారం. కర్రలు, భోజనం ప్లేట్లతో కొట్టి బూట్లతో అభిషేక్‌ ‌రెడ్డి ముఖంపై విద్యార్థులు తొక్కినట్లు తెలుస్తోంది. ఈ దాడికి మెట్లపై నుంచి బాధితుడు కింద పడిపోయాడు. విషయం తెలిసిన వెంటనే తల్లిదండ్రులకు స్కూల్‌ ‌యాజమాన్యం సమాచారం అందజేశారు. అభిషేక్‌ ‌రెడ్డిని కామారెడ్డి హాస్పిటల్‌కి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *