మజ్లిస్‌కు కొమ్ముకాస్తున్న రంగనాథ్‌

-‌ నాదర్‌గుల్‌ ఆ‌క్రమణలపై చర్యలు తీసుకుని హైడ్రా
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు విమర్శలు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఆగస్ట్ 10: ‌హైడ్రా కమిషనర్‌ ‌రంగనాథ్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌ ‌రావు మరోసార్‌ ‌హాట్‌ ‌కామెంట్స్ ‌చేశారు. హైకోర్టు చెప్పినా రంగనాథ్‌ ‌తీరు మారడం లేదని వ్యాఖ్యానించారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..  రంగనాథ్‌కు మజ్లీస్‌ ‌దున్న ప్రేమ.. ప్రజల ద లేదని విమర్శించారు. కోర్ట్‌ను తప్పుదోవ పట్టిస్తూ కాలయాపన చేయడం సరికాదన్నారు. నాదర్‌గుల్‌లో చాలా ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా ఎందుకు పరిరక్షించడం లేదని ప్రశ్నించారు. అక్కడ ఎన్నో ఎకరాల భూమిలో అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని తెలిపారు. వేల ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడామని చెబుతున్న హైడ్రా.. మరి ఆ భూములను ఎక్కడ దాచిపెట్టారని.. ఎందుకు ప్రజల ముందు ఉంచడం లేదని నిలదీశారు. పరిపాలనలో లోపంతోనే అధికారులపై ఆరోపణలు వస్తున్నాయని  రామచందర్‌రావు విమర్శించారు. సల్కమ్‌ ‌చెరువులో అక్రమ నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కోర్టులను కూడా అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. న్యాయస్థానాల ఆదేశాలున్నా చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వ భూములను ఎవరు కబ్జా చేసినా చూస్తూ ఊరుకోం. క్యూర్‌పై ఆగస్ట్ 15 ‌తర్వాత బీజేపీ ఆధ్వర్యంలో సెమినార్‌ ‌నిర్వహిస్తాం. ఆ తర్వాత ఉద్యమాలు ఉద్ధృతం చేస్తాం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిని రెండేళ్ల తర్వాత తప్పకుండా మారుస్తారు. ఎస్‌ఐఆర్‌ ‌పక్రియ ముగిసిన తర్వాత జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు ఉంటాయని అనుకుంటున్నాం. ఇథనాల్‌తో వాహనాల ఇంజిన్‌లు పాడైపోతాయని ఇండియా కూటమి తప్పుడు ప్రచారం చేస్తోందని రామచందర్‌రావు అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి వరుణయాగం చేస్తే.. తాము రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌కొట్టుకుపోవాలని వాయు యాగం చేస్తామన్నారు. వానాకాలం అంతా అయిపోయాక రేవంత్‌ ‌రెడ్డిది ఇదో కొత్త నాటకమంటూ విమర్శించారు. రాష్ట్రంలో ఎల్‌నినో ఉన్న విషయం సీఎంకు తెలియదా అని రాంచందర్‌ ‌రావు ప్రశ్నించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *