– పాండురంగాపురం – సాకేతపురి పనులకు మోక్షం
– ఆధ్యాత్మిక, పారిశ్రామిక ప్రగతికి సరికొత మార్గం
– మంత్రి తుమ్మల విజ్ఞప్తికి కేంద్రం ఓకే
భద్రాద్రి కొత్తగూడెం, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3 : జిల్లా అభివృద్ధికి కీలకమైన పాండురం గాపురం–మల్కనగిరి రైల్వే లైన్ కు మరోసారి కదలిక వచ్చింది. వివిధ కారణాలతో పూర్తి ప్రాజెక్టు ఆలస్యమవుతున్న నేపథ్యంలో… ప్ర స్తుత దశలో పాండురంగాపురం నుంచి మధ్య లోని సాకేతపురి (సారపాక) వరకు సుమారు 16 కి.మీ. రైల్వే లైన్ పనులను ముందుగా చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వ రరావు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణన్ను కోరారు. మంత్రి తుమ్మల విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే మంత్రి సానుకూలంగా స్పందించి, ఈ మార్గం లో పనులను వేగవంతం చేసేందుకు అవస రమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పూర్తి ప్రాజెక్టుకు పలు అవరోధాలు
రైల్వే మంత్రితో జరిగిన చర్చలో పాండురంగాపురం- మల్కనగిరి లైన్ ప్రస్తుత పరి స్థితిని మంత్రి తుమ్మల వివరించారు. గతంలో రైల్వే మంత్రులుగా పనిచేసిన లాలూ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీ, సురేశ్ ప్రభు, పీయూష్ గోయల్ హయాంలోనూ ఈ రైల్వే లైన్ ప్రతిపాదనకు అనుకూలత లభించినప్పటికీ వివిధ కారణాలతో పనులు పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదని తెలిపారు. భూసేకరణ, అటవీ అనుమతులు, గోదావరి వంతెనతోపాటు ఇతర రైల్వే వంతెనల నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియలు పూర్తి ప్రాజెక్టుకు ప్రధాన అవరోధాలుగా ఉన్నాయని మంత్రి వివరించారు. ఈ అంశాలన్నింటినీ పరిష్కరించి పాండురంగాపురం- మల్క నగిరి పూర్తి రైల్వే లైన్ నిర్మించేందుకు కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు.
సాకేతపురి వరకు ముందుగా పనులు
పాండురంగాపురం నుంచి సాకేతపురి (సారపాక) వరకు సుమారు 16 కి.మీ మేర లైన్ నిర్మాణానికి పెద్దగా అవరోధాలు లేనందున ఈ దశలో ఆ పనులను ముందుగా చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రి తుమ్మల కోరారు. పాండురంగాపురం-సాకేతపురి మధ్య రైల్వే లైను అవసరమైన భూ సేకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రికి తెలిపారు.
భక్తులకు మరింత చేరువలో భద్రాచలం
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి దేశ నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఈ రైల్వే మార్గం ఎంతో ప్రయోజనకరంగా మారనుంది. సాకేతపురి వరకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి వస్తే భద్రాచలం ప్రాంతానికి రాకపో కలు సులభతరం కానున్నాయి. రైల్వే కనెక్టివిటీతో భద్రాచలంలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు వచ్చే అవకాశం ఉంది. భద్రాచలం, గోదావరి పరివాహక ప్రాంతాల్లో పర్యాటక కార్యకలాపాలు విస్తరించడంతోపాటు భక్తులు, పర్యాటకుల రాక పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి, వ్యాపార అవకాశాలు మెరుగుపడనున్నాయి.
పారిశ్రామిక రంగానికి రవాణా బలం
ఇభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పారిశ్రామిక రంగానికి కూడా రైల్వే కనెక్టివిటీ కీలకంగా మారనుంది. సింగరేణి, బీపీఎల్, వాటర్ ప్లాం జట్లు, కేటీపీఎస్ తదితర పరిశ్రమలకు ముడినరకు, ఉత్పత్తుల రవాణా మరింత సులభతరం కానుంది. రైల్వే సౌకర్యం అందుబాటులోకి రావడంతో పెట్టుబడులు ఆకర్షించేందుకు అనుకూల వాతావరణం ఏర్పడనుంది.
భూసేకరణకు రాష్ట్రం సిద్ధం
కేంద్రం నుంచి సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో పాండురంగాపురం- సాకేతపురి మధ్య భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి అవసరమైన భూమిని రైల్వే శాఖకు అప్పగించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. పాండురంగాపురం-మల్కన్ గిరి రైల్వే లైన్ నిర్మాణానికి ఉన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగుతున్న క్రమంలో సాకేతపురి వరకు రైల్వే లైన్ అందుబాటులోకి రావడం భద్రాద్రి ప్రాంత అభివృద్ధికి కీలక మలుపుగా నిలవనుంది. ఆధ్యాత్మిక పర్యాటకం, పారిశ్రామిక ప్రగతి, స్థానిక ఉపాధి, వ్యాపార అవకాశాలకు ఈ రైల్వే కనెక్టివిటీ మరింత బలాన్నివ్వనుంది
తుమ్మల విజ్ఞప్తికి తక్షణ స్పందన
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు విజ్ఞప్తిపై కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సానుకూలంగా స్పందించా రు. పాండురంగాపురం- సాకేతపురి మా
ర్గంలో పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రైల్వే అధి కారులను ఆదే శించారు. దీంతో ఎన్నో దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న భద్రాచలం ప్రాంత రైల్వే కనెక్టివిటీకి తొలి అడుగు పడినట్లయింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





