రేవంత్ రెడ్డిని శపిస్తున్నా

– నా తల్లికి తీవ్ర అన్యాయం జరిగింది
– సురేఖ కూతురు సుష్మిత ఆవేదన
– పరకాల నియోజకవర్గంలో పోటీకి రేవంతుకు సవాల్

వరంగల్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 3: రాష్ట్ర మంత్రివర్గం నుంచి కొండా
సురేఖను సీఎం రేవంత్ రెడ్డి బర్తరఫ్ చేయడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. ఈ నిర్ణయంపై సురేఖ కుమార్తె సుష్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తన తల్లికి అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తంచేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆమె శాపనార్థాలు పెట్టారు. తల్లి బర్తరఫ్పా స్పందించిన సుస్మిత “నా తల్లికి అన్యాయం జరిగింది. ఆమె పట్ల అనుసరించిన తీరు నన్ను తీవ్రంగా బాధించింది. మా అమ్మ గొంతును ఎవరూ నొక్కలేరు. నేను రేవంత్ రెడ్డిని శపిస్తున్నా” అని వ్యాఖ్యానించారు. “నా తల్లి ప్రాతినిధ్యం వహిస్తున్న పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నాను” అని పేర్కొన్నారు. గతంలో తాను చేసిన వ్యాఖ్యలు కేవలం వ్యక్తిగత హోదాలో ఒక వ్యక్తిని ఉద్దేశించినవే తప్ప, ఏ పార్టీకి వ్యతిరేకం కాదని ఆమె స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *