హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : తండ్రి మందలించాడనే మనస్తాపంతో ఓ బాలిక కఠిన నిర్ణయం తీసుకుంది. ఉప్పుగూడ రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైలుకు ఎదురుగా వెళ్లి ప్రాణాలు తీసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడకు చెందిన ఓ బాలిక అస్తమానం ఫోన్‌లో గడిపేది. ఇది గమనించిన తండ్రి.. పలుమార్లు ఆమెను మందలించాడు. దీంతో మనస్తాపం చెందిన ఆ బాలిక.. ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత గురువారం ఉదయం ఉప్పుగూడ రైల్వేస్టేషన్ సమీపంలో శవమై తేలింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే బాలిక వివరాలు సేకరించి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు