పశువుల కొవ్వు, ఎముకలతో నూనె తయారీ

– ప్రజల ప్రాణాలతో అక్రమార్కుల చెలగాటం!
– ముదిగొండలో వెలుగుచూసిన భయంకరమైన కల్తీ వ్యవహారం
– సింథటిక్ రంగులు, రసాయనాలతో పాలు, పన్నీర్, మసాలాల తయారీ
– 7 నెలల్లో 81 నమూనాలు ప్రమాణాలు లేనివిగా గుర్తించిన అధికారులు

ఖమ్మం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఆహార పదార్థాల కల్తీ దందా పడగవిప్పుతోంది. రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనే అక్రమార్కుల కక్కుర్తి సామాన్య ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర ప్రమాదంలోకి నెడుతోంది. గతంలో భద్రాచలంలో వనస్పతి, రిఫైండ్ ఆయిల్తో నకిలీ నెయ్యి తయారుచేసిన ఉదంతం మరవకముందే.. తాజాగా ముదిగొండ మండలంలో పశువుల కొవ్వు, ఎముకలను “ఉడికించి నూనె తయారుచేస్తున్న ఘోరం వెలుగులోకి రావడం కలకలం సృష్టిస్తోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని వెంకటాపురంలో ఆవు కొవ్వు, ఎముకలతో తయారు చేసిన 150 లీటర్ల నూనెను పోలీసులు. ఆహార భద్రతా అధికారులు మం -గళవారం పట్టుకున్నారు. ఓ ఇంట్లో నుంచి దుర్వాసన వస్తు ఉన్నట్లు స్థానికులు గుర్తించి అధికారులకు సమాచారం అందిం చారు. షేక్ అన్వర్ జానీ, సర్వర్ జానీ ఇద్దరూ ప్రతీనెలా ఆవు *లను కోసి మాంసాన్ని విక్రయిస్తున్నారు. ఆవు కొవ్వు, ఎముకలను ఉడికించి నూనె తీస్తున్నారు. ఆ నూనెను డబ్బాల్లో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. ఈ నూనెను వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. నూనెను వేడి చేసే క్రమంలో దుర్వాసన రావడంతో కల్తీ దందా వెలుగు చూసింది. ఆరు నెలలుగా ఈ దందా కొనసాగుతున్నట్లు సమాచారం. తనిఖీ సమయంలో 15 కిలోల ఆవు కొవ్వు, 150 లీటర్ల నూనె అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

హానికర రంగులు

బేకరీలు, హోటళ్లల్లో హానికర రంగులు వాడుతున్నారు. ఖమ్మం, మధిర, సత్తుపల్లి తదితర శివారు ప్రాంతాల్లోని శిథిల గృహాల్లో అక్రమార్కులు కల్తీ ఆహార పదార్థాలను తయారు చేస్తున్నారు. సింథటిక్ ఫుడ్ కలర్, యాసిడ్లతో అల్లం, వెల్లుల్లి పేస్ట్, యూరియా, డిటర్జెంట్లతో పాలు, పెరు గు. పన్నీరు. నెయ్యి తయారు చేస్తున్నారు. మసాలా దినుసుల్లో టాల్కం పౌడర్, సింథటిక్ రంగులు కలుపు తున్నారు. ఆకర్షణీయమైన రంగులు, ప్యాకింగ్ చూసి కొనొద్దు. ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) లైసెన్స్ ఉన్న ఉత్పత్తులనే కొనుగోలు చేయాలి. తయారీ, గడువు తేదీ, సరి చూసుకోవాలి. అసాధారణ రంగు, వాసన ఉంటే వాటికి దూరంగా ఉండాలి.

255 నమూనాలు సేకరించాం

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత ఏడు నెలల్లో జరిపిన దాడుల్లో సుమారు 255 నమూ నాలు సేకరించినట్లు ఆహార భద్రత తనిఖీ అధికారి శరత్ తెలిపారు. బేకరీలు, దుకాణాలు, హోటళ్ల నుంచి వీటిని తీసుకుని ప్రయోగశాలల్లో పరిశీలిస్తు న్నాం. ఆ నమూనాల్లో ఇప్పటి వరకు నాణ్యత ప్రమాణాలు లేనివి 81 ఉండగా.. అసురక్షితమైనవి 36 నమూనాలను గు ర్తించాం. కల్తీ జరిగితే చర్యలు తీసుకుంటున్నాం. ప్రత్యేకంగా ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు ఖమ్మం జిల్లాలో 199 నమూనా లు సేకరించాం, 46 నాణ్యత ప్రమాణాలు లేవని తేలింది. 15 అసురక్షితం తేలింది. 26 కేసులు పరిష్కరిం చాం. 1.48 లక్ష లు జరిమానా విధించామని ఆహార భద్రత తనిఖీ అధికారులు వివరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *