మయూరినగర్‌లో విషాదం

– టెర్రస్‌పై నుంచి పడి యువతి మృతి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూన్ 23  :మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మయూరినగర్‌లోని బొమ్మరిల్లు అపార్ట్‌మెంట్‌లో ఫోన్ మాట్లాడుతూ టెర్రస్ నుంచి పడి 20 ఏళ్ల యువతి మృతిచెందిన సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాకు చెందిన బుద్ధ శ్రీ ప్రాణమ్య మృతురాలిగా గుర్తించారు. అమెరికాలో ఉంటున్న తల్లిదండ్రులతో కలిసి ఇటీవల అమ్మమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం ఐదో అంతస్తు టెర్రస్‌పై ఫోన్ మాట్లాడుతూ గోడకు ఆనుకొని నిలబడగా అదుపు తప్పి కిందపడింది.వాచ్‌మ్యాన్ సమాచారంతో తల్లి ప్రశాంతి కూతురిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ప్రాణమ్య ఆన్‌లైన్ డిగ్రీ చదువుతోందని, రెండు మూడు రోజుల్లో వేరే ఫ్లాట్‌కు మారాల్సి ఉందని స్థానికులు తెలిపారు.ఈ ఘటనపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టెర్రస్ రైలింగ్ ఎత్తు, భద్రతా చర్యలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
————————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *