– ఇద్దరు టైల్స్ కార్మికుల దుర్మరణం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 8 : నగరంలో ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం అర్ధరాత్రి గచ్చిబౌలి సమీపంలోని నియో పోలీస్ బ్రిడ్జ్ పిల్లర్‌ను టవేరా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు రాజస్థాన్‌కు చెందిన కనైయాలాల్ (25), దేరామ్ (24)గా గుర్తించామని తెలిపారు. వీరిద్దరు టైల్స్ కార్మికులుగా పనిచేస్తున్నారని చెప్పారు. ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు