గురుకుల భవనం నుంచి దూకిన విద్యార్థిని

– పరిస్థితి విషమం.. దవాఖానకు తరలింపు
– సిద్దిపేట జిల్లాలో కలకలం

సిద్దిపేట, ప్రజాతంత్ర, ఆగస్టు 25: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో తాత్కాలిక భవనంలో కొనసాగుతున్న మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశా లలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాఠశాలలో ఏడో తరగతి చదువు తున్న బాలిక మూడంతస్తుల భవనంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయ -పడింది. అక్బర్పేట భూంపల్లి మండలానికి చెందిన బాలిక ఈనెల 17న ‘బాలికల గురుకుల హాస్టల్లో చేరినట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం స్నానానికి వెళ్లిన సమయంలో మూడంతస్తుల భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన సిబ్బంది వెంటనే అప్రమ త్తమై ఆమెను సిద్దిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని నిమ్స్ తరలించినట్లు ప్రిన్సిపల్ కరుణ తెలిపారు. కాగా బాలిక భవనం పైనుంచి దూకడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు హాస్టల్ వద్దకు చేరు కుంటుండటంతో అక్కడ ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అధికారులు ఘటనపై విచారణ చేపడుతున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *