న్యూదిల్లీ, ఆగస్ట్ 29 : జాతీయ క్రీడల దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ క్రీడాభిమానులకు శుభాకాంక్షలు చెప్పారు. యువతరానికి స్ఫూర్తిగా నిలవడంలో క్రీడల ప్రాధాన్యతను వివరించారు. నిబద్ధత కలిగిన ప్రతి క్రీడాకారుడిని ప్రశంసించారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. అలాగే భారత మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ కూడా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోను షేర్ చేశారు. ప్రతి క్రీడాకారుడికి.. అంకితభావం, అభిరుచి, పట్టుదల అందరికీ గర్వకారణం. తరతరాలకు స్ఫూర్తినిచ్చే ప్రతిభావంతుడైన దిగ్గజ మేజర్ ధ్యాన్ చంద్‌కు నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ పేర్కొన్నారు. క్రీడలు అంటే కేవలం గెలవడం మాత్రమే కాదని నేనెప్పుడూ నమ్ముతా. కలలు కనడం, కష్టపడటం, ఎదురుదెబ్బలను తట్టుకొని ముందుకు సాగడం నేర్పిస్తాయి. జాతీయ క్రీడాదినోత్సవం నాడు యువతను మరింత ఎక్కువగా గేమ్స్ ఆడేలా ప్రోత్సహిద్దామని క్రికెటర్ శిఖర్ ధావన్ అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





