వరంగల్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 29: కాన్పూర్ సెంట్రల్- మధురై మార్గంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ సెప్టెంబర్ 2 నుంచి రెండు ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. నవంబర్ 28 వరకు ఈ రైళ్లు కాన్పూర్ సెంట్రల్- మధురై మధ్య నడుస్తాయి. కాన్పూర్ సెంట్రల్- మధురై(01925) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 2 నుంచి నవంబర్ 25 వరకు ప్రతీ బుధవారం ఉదయం 8.10 గంటలకు కాన్పూర్ సెంట్రల్ నుంచి బయలుదేరి శుక్రవారం ఉదయం 7.15 గంటలకు మధురై చేరుకుంటుంది. మధురై-కాన్పూర్ సెంట్రల్(01926) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 5 నుంచి నవంబర్ 28 వరకు ప్రతీ శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు మధురై నుంచి బయలుదేరి సోమవారం తెల్లవారుజామున 4.30 గంటలకు కాన్పూర్ సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లోని సిరిపూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వేస్టేషన్‌లలో ఆగుతాయి. వీటిలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, థర్డ్ ఏసీ ఎకానమి, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ముఖ్య ప్రజాసంబంధాల అధికారి ఎ.శ్రీధర్ శనివారం తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





