సంప్రదాయంగా చీరలు కట్టి.. నుదుటన తిలకం దిద్ది..

జిల్లా సందర్శనకు వచ్చిన వివిధ దేశాల సుందరీమణులకు ఘన స్వాగతం
హోటల్ హరిత కాకతీయ వద్ద బతుకమ్మ, సంగీత వాయిద్యాలు
వరంగల్ సందర్శనకు వొచ్చిన 20 దేశాల సుందరీమణులు

హనుమకొండ, ప్రజాతంత్ర మే 14: ఆనాటి కాకతీయ సామ్రాజ్య రాజధాని నగరం, వరంగల్ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం, వరంగల్ కోటను సందర్శించేందుకు హెరిటేజ్ వాక్ లో భాగంగా వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు బుధవారం సాయంత్రం హనుమకొండ కు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సు లో విశ్వ సుందరి పోటీల్లో పాల్గొంటున్న సుందరీ మణులు హనుమకొండ లోని టూరిజం హోటల్ హరిత కాకతీయ కు సాయంత్రం 4:35 గంటలకు చేరుకోగా పూలమాలలు వేసి వారిపై పూలు చల్లి హోటల్ వద్ద ఘన స్వాగతం పలికారు.  సుందరీమణులు జిల్లాకు వొచ్చిన సందర్భంగా వరంగల్ హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేశారు.

హనుమకొండకు చేరుకున్న అర్జెంటీనా, బ్రెజిల్, బొలివియా, కెనడా, చిలీ, కొలంబియా, ఈక్వెడార్,  ఎల్ సాల్వేడార్, గ్వాటేమాల, హైతీ, హోండురస్, మెక్సికో, నికరాగ్వా, పరాగ్వే, పనామా, పెరూ, అమెరికా, సూరి నామ్, వెనుజుల, బెలిజ్ దేశాలకు చెందిన సుందరీమణులకు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో మహిళలు, సంప్రదాయ డోలు వాయిద్యాలతో ఆత్మీయ స్వాగతం పలికారు. మహిళలతో కలిసి బతుకమ్మ పాటలకు సుందరీమణులు నృత్యాలు చేశారు.

హరిత కాకతీయ నుండి భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించే విధంగా వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వేయి స్తంభాల దేవాలయానికి బయలుదేరారు. హనుమకొండ లోని చారిత్రక వేయి స్తంభాల దేవాలయం వద్ద వివిధ దేశాల సుందరీమణులకు సాంప్రదాయ నృత్యాలతో స్వాగతం పలికిన మహిళలు. ఆలయ ప్రవేశ మార్గం వద్ద సుందరీమణులకు పుష్ప గుచ్ఛాలతో స్వాగతం పలికిన వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే నాయిని రాజేందర్, రెడ్డి, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రాం రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, జీ డబ్ల్యూఎంసి  కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, తదితరులు  వొచ్చారు. ఆలయ ఆవరణలో కోనేరును పరీశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page