పడ్డ మట్టిదిబ్బలు కూలి ముగ్గురి మృతి

ఎల్బీనగరలో సెల్లార్‌ ‌తవ్వుతుండగా ఘటన
 మృతులంతా బిహార్‌ ‌వాసులుగా గుర్తింపు

నగరంలోని ఎల్బీనగర్‌లో సెల్లార్‌ ‌తవ్వకాల్లో ప్రమాదం చోటుచేసుకుందిసెల్లార్‌ ‌లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయిఈ క్రమంలో మట్టిదిబ్బల కింద కూరుకుపోయి ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారుఒకరికి తీవ్ర గాయాలయ్యాయిసమాచారం అందిన వెంటనే పోలీసులుఫైర్‌ ‌సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారుమట్టిదిబ్బల కింద నుంచి మూడు మృతదేహాన్ని బయటకు తీశారుఅయితే రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అతికష్టం మీద మూడు మృతదేహాలను వెలికితీశారుమృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు.

 మృతులు వీరయ్యవాసురాములుగా తెలుస్తోందిముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా కు తరలించగా.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించారుఒక్కసారిగా సెల్లార్‌లో మట్టిదిబ్బలు కూలి పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారుమృతుల్లో ఇద్దరు తండ్రీకొడుకులు ఉన్నట్లు గుర్తించారుమృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పనిచేసే ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయిఅయితే సెల్లార్‌ ‌తవ్వకాలు జరుపుతున్న సమయంలో జీహెచ్‌ఎం‌సీ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందిఅయితే సెల్లార్‌ ‌తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *