మళ్లీ మనదే అధికారం

– ఇందుకు ఇక రోజుకు 18 గంటలు పనిచేస్తాం
– కాంగ్రెస్ కు ఖమ్మం గుండెకాయ
– డిప్యూటీ సీఎం కోరిక మేరకు మధిరకు
– ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు
– పాపాలభైరవుడు ఫాంహౌస్ లోనే బందీ
– బీఆర్ఎస్ సర్వేలు బ్యాండ్ మేళం టైపు
– కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా తొక్కేస్తా
– బావాబావమరుదులు కలసి ఊరు మీద పడి తిరుగుతున్నారు
– మధిర రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

చింతకాని /ఖమ్మం, ప్రజాతంత్ర, జూలై 10 : ఔర్ ఏక్ బార్.. కాంగ్రెస్ సర్కార్.. అంటూ సీఎం రేవంత్ రెడ్డి నినదించారు. ఖమ్మం జిల్లా నుంచే ఆ విజయం ప్రారంభమవుతుందని చెప్పారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2028లో జరగవని, 2029 మే, జూన్ ల్లో మాత్రమే జరుగుతాయని తెలిపారు. రాష్ట్రంలో పార్లమెంట్ స్థానాలతోపాటు అసెంబ్లీ స్థానాలు కూడా పెరుగుతాయన్నారు. ఆ ఎన్నికల్లో 20 ఎంపీ స్థానాల్లో విజయం సాధించి రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తామని, 117 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందడం ద్వారా మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ ‘బ్యాండ్ మేళం’ సర్వేలు నిర్వహించుకుంటోందన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం జగన్నాథపురంలో శుక్రవారం నిర్వహించిన రైతు ఆశీర్వా ద సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసం గించారు. ఈ సభలో రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు  ఆయన మాటల్లోనే.. రాజకీయంగా పాలమూరు ప్రాణమైతే ఎదుగుదలలో ఖమ్మం జిల్లా గుండెకాయలా పని చేసింది. 2023 జూలైలో ఖమ్మంలో అద్భుత సన్నివేశం జరిగింది.. కేసీఆ ర్ ను, బీఆర్ఎస్ పార్టీని వంద అడుగుల లోతున పాతిపెట్టడానికి పొంగులేటి రాహుల్ గాంధీని ఆహ్వానించినపుడు ఈ సన్నివేశం సాక్షాత్కరిం చింది. సరిగ్గా 36 నెలల తర్వాత జగన్నాధపురం లో అదే సన్నివేశం.. ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ ను నిషేధించబడింది. ఇది అషామాషీ సభకాదు.. పరిపాలనా సభ కానే కాదు.. భవిష్యత్ ప్రణాళికలను రచించుకుని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారో ఈ సభ చెబుతోంది. కాంగ్రెస్ 65, సీపీఐ ఒకటి చొప్పున గెలుస్తుందని 2023 ఎన్నికలకు ముం దు గాంధీభవన్ లో మీడియాకు ఆనాడే చెప్పా ను. అదే నిజమైంది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు రెండు సీట్లు ఇచ్చారు. చేవెళ్ల సభలో కూడా చెప్పాను.. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా అని.. చెప్పిందే నిజమైంది.. పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో నేను చెప్పింది చెప్పినట్లుగానే ప్రజాతీర్పు వచ్చింది. పాపాలభైరవుడు ఫాం హౌజ్ లోనే బందీ అవుతాడని చెప్పాను. భవిష్యత్తు చరిత్రను, జరగబోయే కురుక్షేత్ర యుద్ధాన్ని ఈ వేదిక మీద నుంచే చెబుతున్నా.. కల్వకుంట్ల కు టుంబ కౌరవ వంశాన్ని తెలంగాణా రాజకీయ ముఖచిత్రంగా నుంచి పాతాళానికి తొక్కేవరకు కాంగ్రెస్ కార్యకర్తలు విశ్రమించరు. 

బీజేపీ ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షాలు మమతా బెనర్జీ పార్టీని చీల్చి వాళ్లు అనుకున్న బిల్లును ఆమోదింపజేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. వాళ్లు విజయం సాధించే అవకాశం ఉం ది. 2029 మే, జూన్ లో రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతాయని 36 నెలల ముందు ఖమ్మం గడ్డ నుంచి చెబుతున్నా.. తెలంగాణాలోని 17 ఎంపీ స్థానాలు 26 కు, అసెంబ్లీ స్థానాలు 182కు పెరుగుతాయి. అందులో 117 సీట్లపైన గెలిచి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం.. మీడియా మిత్రులారా రాసుకోండి.. రెండోసారి అధికారంలోకి వస్తాం. భద్రాచలం రాముడి మీద ఆన.. రాసుకో చంద్రశేఖర్ రావు.. నువ్వూ, నీ కొడుకూ, అల్లుడూ, నీ కుటుంబ సభ్యులూ, నీ దొంగ సర్వేల ఏజన్సీలు.. గుర్తు పెట్టుకోండి.. మా టీం రోజుకు 18 గంటలు పనిచేస్తాం.. ప్రజలెవ్వరికీ అన్యాయం జరగనివ్వం.. ప్రజాపాలన సుభిక్ష పాలనను, రామరాజ్యాన్ని తీసుకు వస్తుంది.. రైతు భరోసా ద్వారా రూ.9.000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. 1,70,000 వేల కోట్ల రూపాయలను రైతాంగ సంక్షేమానికి ఖర్చు చేశాం. కరెంట్ వైర్ పట్టుకో.. కాకిలాగా మాడి మసై పోతవా లేదా నేను చూస్తా.. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదన్నారు.. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ హయంలో ఇచ్చాము. 500 రూపాయలను సన్నవడ్లకు బోనస్ కింద రైతులకు రూ. 3,500 కోట్లు ఇచ్చాం.. రైతు కళ్లల్లో ఆనందం చూడాలని, రైతు ఆశీర్వాద సభను ఏర్పాటు చేశాం. మేడిగడ్డలో నీళ్లు నింపి గేట్లు దించి నింపితే భద్రాచలం మునుగుతుంది. 24 ఊళ్లు కొట్టుకుపోతాయ్. ఎన్నికలు ఎప్పుడో తెల్వకుండ, రిజర్వేషన్లు తెల్వకుండ, ఎన్ని సీట్లో తెల్వకుండ సర్వేలు నిర్వహిస్తరా? జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ నాయకులు ఇలాగే చెప్పారు. ఏం జరిగింది జూబ్లిహిల్స్ లో.. బండకేసి కొట్టిండ్రు. బీఆర్ఎస్ సర్వేలు బ్యాండ్ మేళం టైపు.. వాళ్లకు ఇష్టమైన విధంగా సర్వే ఫలితాలు వస్తుంటాయి. బీజేపీలోకి వెళ్లనని, బీజేపీ వాళ్లతో మాట్లాడలేదని భద్రాచలం రాముడి మీద, మేనమామ కేసీఆర్ మీద ఒట్టేసి హరీష్ రావు చెప్పగలడా? కేసులకు భయపడి నీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తరని నీ చెల్లెలే చెబుతోంది. నీ దొంగ సొమ్ము రూ.1,400 కోట్ల ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి కొల్లగొట్టిండ్రని నీ చెల్లెలే చెబుతోంది.. ప్రజలు ఇంకా నీకు ఓట్లేస్తరనుకుంటున్నవా కేటీఆర్? ఖమ్మంలో ఒంటి కన్ను శివరాసన్ ఉన్నడు తెలుసు కదా? మీరిక్కడ అతన్ని పువ్వాడ అజయ్ అంటరు.. హైదరాబాద్ లో ఒంటికన్ను శివరాసన్ అంటరు. మా అక్కలు కర్రు కాల్చి, సలాక్ ఎర్రగ కాల్చి ఇటువంటి బీఆర్ఎస్ నాయకులకు వాతలు పెడుతరు. కేసీఆర్ ప్రవేశపెట్టిన ఏ పథకాన్నయినా ఈ ప్రభుత్వం రద్దు చేసిందా? ప్రజా సంక్షేమం కోసం గత ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నాం. అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని సమయస్ఫూర్తితో నడిపిస్తు న్నాం.. మేం అమలు చేస్తున్న పథకాల లబ్ధదారులు మాకు ఓట్లు వేస్తే బీఆర్ఎస్ కు డిపాజిట్లు కూడా దక్కవ్.. రాహుల్ ను ప్రధానిని చేస్తాం.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలోని 26 స్థానాల్లో 20 పార్లమెంట్ సీట్లను రాహుల్ ను ప్రధానిని చేసేందుకు నుంచి అందిస్తాం.. రాహుల్ గాంధీని ఖమ్మం తీసుకువచ్చి, ఇదే మధిర జగన్నాథపురంలో ఐదు లక్షల మందితో సభ ఏర్పాటు చేస్తాం. భట్టి విక్రమార్క అభ్యర్థన మేరకు మధిరకు ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నా అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *