గురుకులంలో ఫుడ్ పాయిజన్‌పై సుమోటోగా కేసు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలోని ప్రాజెక్టు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో 26-27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా విచారణ చేపట్టింది. అల్పాహారం తీసుకున్న అనంతరం వీరు అస్వస్థతకు గురయ్యారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధిత విద్యార్థుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, విచారణ నివేదిక, ఆహారం, తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన చర్యలపై కూడా నివేదిక ఇవ్వాలని టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. తదుపరి విచారణకు ఆగస్టు 11వ తేదీకి వాయిదా వేసింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *