ముగిసిన క్లస్టర్-ఎ 5వ పోలీస్ గేమ్స్, స్పోర్ట్స్ మీట్

– 21 పోలీస్ యూనిట్ల నుంచి పాల్గొన్న 831మంది క్రీడాకారులు
– హైదరాబాద్ కమిషనరేట్‌కు ఓవరాల్ ఛాంపియన్‌షిప్
– ద్వితీయ స్థానంలో టీజీఎస్పీ-2, తృతీయ స్థానంలో మల్కాజిగిరి కమిషనరేట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 9 : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 5వ తెలంగాణ పోలీస్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్-2026 (క్లస్టర్–ఎ) రెండు రోజులపాటు అత్యంత ఉత్సాహభరితంగా, క్రీడా స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ విజయవంతంగా ముగిసింది. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ ప్రతిష్టాత్మక క్రీడా పోటీల్లో రాష్ట్రంలోని వివిధ పోలీస్ యూనిట్లకు చెందిన అధికారులు, సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ క్రీడలను డీజీపీ సి.వి.ఆనంద్ స్పోర్ట్స్ టార్చ్‌ను అందించి బుధవారం ప్రారంభించారు.

వెల్లి విరిసిన క్రీడా స్ఫూర్తి

క్లస్టర్-ఎలో భాగంగా మొత్తం 14 ఇండోర్ క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహించారు. రెజ్లింగ్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, ఆర్మ్ రెజ్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్, యోగా, జూడో, వుషు (టావోలుతో సహా), తైక్వాండో, కరాటే, పెన్చాక్ సిలాట్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్ విభాగాల్లో పోటీలు జరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 21 పోలీస్ యూనిట్లకు చెందిన మొత్తం 831 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వీరిలో 683మంది పురుషులు, 148మంది మహిళా పోలీస్ సిబ్బంది ఉన్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, మల్కాజిగిరి వంటి కమిషనరేట్లు, జిల్లా పోలీస్ యూనిట్లు, తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ), ఆర్‌బీవీఆరఆర్ తెలంగాణ పోలీస్ అకాడమీ, పోలీస్ ట్రైనింగ్ కాలేజీలు, గ్రేహౌండ్స్, ఆక్టోపస్, కమ్యూనికేషన్స్, పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ అండ్ స్టాండర్డ్స్, పోలీస్ ట్రాన్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్, ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్స్ బ్యూరో, సీఐడీ, రైల్వే పోలీస్ తదితర యూనిట్లు పాల్గొన్నాయి. పోటీలు అత్యంత క్రమశిక్షణతో, ఉన్నత ప్రమాణాలతో నిర్వహించగా క్రీడాకారులు విశేష ప్రతిభను కనబరిచారు.

ఓవరాల్ ఫలితాలు

పోటీలలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అత్యుత్తమ ప్రదర్శనతో మొత్తం 140 పతకాలు సాధించి ఓవరాల్ ఛాంపియన్‌గా నిలిచింది. ఇందులో 64 స్వర్ణ, 44 రజత, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. తెలంగాణ స్పెషల్ పోలీస్-2 ద్వితీయ స్థానాన్ని 58 పతకాలతో కైవసం చేసుకుంది. ఇందులో 19 స్వర్ణ, 16 రజత, 23 కాంస్య పతకాలు ఉన్నాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *