– నో అబ్జెక్షన్ ఫైర్ సర్వీస్ పత్రాలు ఇంటర్ బోర్టుకు సమర్పణ
– 8 ఇంటర్ కాలేజీలపై చర్యలకు ఆదేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5 : హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు ఎని మిది ప్రైవేటు కాలేజీలు.. రంగనాథ్ సంతకా న్ని ఫోర్జరీ చేశాయి. హైడ్రా పేరును దుర్విని యోగం చేస్తూ నకిలీ ఫైర్ ఎన్వోసీలను సృ ష్టించిన కళాశాలలు.. వాటిని ఇంటర్మీడియ ట్ బోర్డుకు సమర్పించాయి. ఈ విషయం గు ర్తించిన అధికారులు దీనిపై విచారణ చేపట్ట గా.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకం ఫోర్జరీ చేసినట్లు నిర్దారించారు. దీంతో నకిలీ పత్రాలు సమర్పించిన ఎనిమిది ప్రైవేట్ కళా శాలల గుర్తింపును రద్దు చేయాలని సంబం ధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. అలాగే ఈ ఘటనపై లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. ఫోర్జరీ, నకిలీ పత్రాల సృ తదితర కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైడ్రా పేరుతో నకిలీ ఫైర్ నో అబ్జక్షన్ సర్టిఫికెట్లు సృష్టించి ఇంటర్మీడియట్ బోర్డుకు సమర్పించిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన అధికారులు 8 ప్రైవేటు జూనియర్ కాలేజీలపై కేసు నమోదు చేశారు. ఈ పత్రాల ఆధారంగా గుర్తింపు పొందేందుకు ప్రయత్నించినట్లు వెల్లడైంది. ఈ వ్యవహా రంపై సంబంధిత అధికారులు ఫిర్యాదు చేయ డంతో లేక్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తులో తెల్లాపూర్, చిక్కడపల్లి, ఎస్ఆర్ నగర్, మెహిదీపట్నం, బర్కత్పురా ప్రాంతం లోని 8 ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ఈ ఫోర్జరీకి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని ఇంటర్మీడియట్ బోర్డుకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఇదే తరహాలో సమర్పించిన మరో 60 ప్రైవేటు కాలేజీ ఫైర్ ఎన్ఎసీలను కూడా అధికారులు స్క్ర్కూటినీ చే స్తున్నారు. వాటి ప్రామాణికతపై విచారణ కొ నసాగుతోందని, దర్యాప్తులో మరిన్ని అక్ర మాలకు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




