– హద్దులు మీరితే సామాజిక మాధ్యమమూ ప్రమాదమే
– మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి
భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 8 : మారిన, మా రుతున్న పరిస్థితులకు అనుగుణంగా మీడియాకు స్వీయ నియంత్రణ అవసరమని. వేగంగా సమా చారాన్ని చేరవేసే క్రమంలో పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివా సరెడ్డి తెలిపారు. వార్తల్లో వేగం, వ్యక్తిత్వ హననా నికి దారితీయొద్దని ఆయన సూచించారు. సోషల్ మీడియా సమాజంపై ప్రభావం అనే అంశంపై టియూడబ్ల్యూజే ఐజేయూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సెమినార్ నిర్వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి కె.రామ్ నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ మీడియా రంగంలో అనేక విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని, సమాచారం పాఠకునికి అత్యంత వేగంగా చేరేవిధంగా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిందన్నారు. టెలీప్రింటర్, టెలీగ్రాఫ్, ఫాక్స్ స్థాయి నుంచి సాంకేతికత క్రమంగా పెరుగుతూ వచ్చిందని తెలిపారు. దీనికితోడు ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత సమాచారం నిమిషాల వ్యవధిలో ప్రజలకు చేరుకుందన్నారు. ఆ ఒరవడి నుంచి ఇప్పుడు సామాజిక మాధ్యమాలు మరింత వేగంగా సమాచారాన్ని అందిస్తున్నాయన్నారు. ప్రింట్ మీడియాకు సంబంధించి వివిధ స్థాయిల్లో వార్తలను పరిశీలించి ఆ తర్వాత తుదిరూపం ఇవ్వడం జరుగుతుందని, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ ఇదే పరిస్థితి ఉందన్నారు. సామాజిక మాధ్యమంలో ఇది లేకపోవడంతో కొన్ని విపత్కర పరి స్థితులకు దారితీస్తుందన్నారు. వ్యక్తులుగా సామాజిక మాధ్యమాలను నిర్వర్తించడం తమ అభిప్రాయాలను వెల్లడించే క్రమంలో తమ అభిప్రాయాలను, అనుమానాలను, ఆలోచనలను ఇతరులపై రుద్దే ప్రయత్నం జరుగుతోందన్నారు. అందుకే సామాజిక మాధ్యమాలకు సంబంధించి స్వీయ నియంత్రణ పాటించాలని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతానికి ఎలక్ట్రానిక్ మీడియా కూడా లేదని ఆయన తెలిపారు. అనంతరం నూతన కమిటీల సన్మాన కార్యక్రమాలు నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ సెమినార్లో ఐజేయు సెక్రటరీ జనరల్ సోమసుందర్, పినపాక, భద్రాచలం శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, యూనియన్ నాయకుడు మాటేటి వేణుగోపాల్, నేషనల్ కౌన్సిల్ సభ్యుడు బి.వి.రమణారెడ్డి, జిల్లా అధ్యక్షుడు జాగు వెంటరత్నం, ప్రధాన కార్యదర్శి జునుమాల రమేష్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





