పది రూపాయల నాణాలతో బైక్‌ ‌కొనుగోలు

– బైక్‌ ‌కోసం రూ.లక్షా పదివేల మొత్తం చెల్లింపు
– నాణాలు చెల్లించడంపై సోషల్‌ ‌మీడియాలో వైరల్‌

‌నల్లగొండ, ప్రజాతంత్ర, జూలై 8: కొంతమంది తాము చేసే పని వినూత్నంగా ఉండాలని భావిస్తారు. అలా చేయడంతో వారి వీడియోలు సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతుంటాయి. తాజాగా ఓ వ్యక్తి బైక్‌ ‌కొనుగోలుకు ఎంచుకున్న మార్గంతో సోషల్‌ ‌మీడియాలో వైరల్‌ అవుతున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి బైక్‌ ‌కొనుగోలు చేశారు. అందుకు అవసరమైన రూ.1.10 లక్షల మొత్తాన్ని రూ.10 నాణాల రూపంలో చెల్లించారు. ఈ బైక్‌ ‌కొనడం కోసం చాలా కాలంగా ఆయన రూ.10 నాణెళిలను పొదుపు చేస్తూ వచ్చారు. అలా దాచిన నగదును అంతా కవర్లలో నింపుకుని బైక్‌ ‌షోరూమ్‌కు వెళ్లారు. ఈ నగదు చెల్లించి తనకు ఇష్టమైన స్ల్పెండర్‌ ‌ప్లస్‌ ‌బైక్‌ను ఆయన కొనుగోలు చేశారు. షోరూమ్‌లోని సిబ్బంది అంతా కలిసి ఈ నగదును లెక్కించారు.  నగదు లెక్కించడానికి కొన్ని గంటల సమయం పట్టింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందించారు. కొండే రఘుపతి పొదుపుతోపాటు పట్టుదలను వారు అభినందించారు. నగదు లెక్కించిన షోరూమ్‌ ‌సిబ్బందికి నెటిజన్లుసెల్యూట్‌ ‌చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *