– స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ పరికరానికి కేంద్రం నుంచి గుర్తింపు
జమ్మికుంట, ప్రజాతంత్ర, జూలై 8: జమ్మికుంట మండలం -మాచనపల్లి గ్రామానికి చెందిన డాక్టర్ కాటిపల్లి లింగారెడ్డికి భారత ప్రభుత్వ మేధోసంపత్తి హక్కుల విభాగం భారతీయ పేటెంట్ (ఇండియన్ పేటెంట్) మంజూరు చేసింది. ఆయన బృందం రూపొందించిన “స్మార్ట్ ఇన్వెంటరీ కంట్రోల్ డివైస్ ఫర్ స్మాల్ బిజినెస్ స్టాక్ అండ్ ఆర్డర్ ఫ్లో మేనేజ్మెంట్” ఆవిష్క రణకు ఈ గుర్తింపు లభించింది. చిన్న వ్యాపార సంస్థల్లో స్టాక్ నిర్వహణ, ఇన్వెంటరీ పర్యవేక్షణ, ఆర్డర్ ప్రవాహాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ సాంకేతిక పరి కరాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆయన హుజరాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర సహాయ ఆచార్యుడిగా విధులు నిర్వహిస్తు న్నారు. భారతీయ పేటెంట్ సాధించిన డాక్టర్ కాటిపల్లి లింగారె డ్డిని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిరాదేవి, అధ్యాపకులు, సిబ్బంది, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





