యూరియా లభ్యత మరింత సరళతరం

– సేవా కేంద్రాల ద్వారా యూరియా బుకింగ్‌
‌- యాప్‌ ‌లో బుకింగ్‌ ‌చేసుకోలేనివారికి సులువైన మార్గం

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,జూలై 8: రాష్ట్రంలోని రైతులకు సబ్సిడీ యూరియా అందుబాటును మరింత సులభతరం చేయటం కోసం ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. పారదర్శకతను పెంపొందిస్తూ సకాలంలో యూరియా పంపిణీ చేయటం కోసం వ్యవసాయ శాఖ యూరియా బుకింగ్‌ ‌సేవను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని సేవ కేంద్రాల ద్వారా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫర్టిలైజర్‌ ‌బుకింగ్‌ ‌యాప్‌ ‌ద్వారా యూరియా బుక్‌ ‌చేసుకోలేని రైతులు తమ సపంలోని  సేవ కేంద్రాన్ని సందర్శించి, ఆపరేటర్‌ ‌సహాయంతో యూరియా బుకింగ్‌ ‌చేసుకోవచ్చు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల. శ్రీధర్‌ ‌బాబు నేతృత్వంలో పనిచేస్తున్న సేవ, వ్యవసాయశాఖతో కలిసి ఈ కొత్త చొరవను ప్రారంభిస్తుంది.రైతు తన పట్టాదారు పాస్‌బుక్‌ ‌నంబర్‌తో  సపంలోని  సేవ కేంద్రాన్ని సందర్శించాలి.  సేవ ఆపరేటర్‌ ‌రైతు వివరాలను సేకరించి, సాగు విస్తీర్ణం మరియు పంట వివరాలను నమోదు చేస్తారు. రైతు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ ‌వద్ద అవసరమైన యూరియా పరిమాణాన్ని బుక్‌ ‌చేస్తారు. రైతు నమోదిత మొబైల్‌ ‌నంబర్‌కు పంపిన  ఓటిపిని ధృవీకరించిన తర్వాత వెంటనే బుకింగ్‌ ఐడి జారీ చేయబడుతుంది.  సేవ ద్వారా పొందిన బుకింగ్‌ ఐడి బుకింగ్‌ ‌చేసిన తేదీని మినహాయించి 48 గంటలపాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.  బుకింగ్‌ ‌గడువు ముగిసేలోపు రైతులు ఎంపిక చేసిన ఎరువుల డీలర్‌ను సంప్రదించి యూరియాను కొనుగోలు చేయాలి. సబ్సిడీ యూరియా బుకింగ్‌ను అధికారిక ఫర్టిలైజర్‌ ‌బుకింగ్‌ ‌యాప్‌ ‌లేదా  సేవ కేంద్రాల ద్వారానే చేయాలని వ్యవసాయశాఖ సూచిస్తోంది.ఓటిపి అందుకోవడానికి రైతులు తమ పట్టాదారు పాస్‌ ‌బుక్‌ ‌తో అనుసంధానమైన మొబైల్‌ ‌నంబర్‌ ‌యాక్టివ్‌లో ఉండేలా చూసుకోవాలి. కేవలం పదిరూపాయల నామమాత్రపు సేవా రుసుముతో సేవ ద్వారా రైతులు అందరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.  ఏవైనా సందేహాలు లేదా సహాయం కోసం సప వ్యవసాయ విస్తరణ అధికారి, మండల వ్యవసాయ అధికారి  లేదా సప సేవ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. ఈ సౌకర్యాన్ని రాష్ట్రంలోని రైతులందరూ వినియోగించుకొని, సబ్సిడీ యూరియాను అధికారిక బుకింగ్‌ ‌విధానం ద్వారా పొందాలని వ్యవసాయశాఖ విజ్ఞప్తి చేస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *